నాగచైతన్య చిత్రంలో రంభ ఐటం సాంగ్
పెళ్లై పాపతో సెటిలైన రంభ మళ్ళీ ఐటం సాంగ్ చేయటానకి రెడీ అవుతోంది. దేవ కట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'లో ఆమెను ఐటం సాంగ్ కి ఒప్పించారని అంతటా వినిపిస్తోంది. గతంలోనూ రంభ...మృగరాజు, అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి, దేశముదురు, యమదొంగ చిత్రాల్లో ఐటం సాంగ్ లు చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ మెరుపులో చేస్తుందని వార్తలు వచ్చాయి కానీ మెటీరియలైజ్ కాలేదు. కానీ ఇప్పుడు రంభ మళ్లీ ఇలా ఎంట్రీ ఇవ్వటం ఆమె అబిమానులను ఆనందపరుస్తోంది.
ఇక ఆటోనగర్ సూర్య చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే...విజయవాడలో బెంజ్ సర్కిల్ ఎంత ఫేమసో... ఆటోనగర్ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే 'ఆటోనగర్ సూర్య' చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది.
మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఈ చిత్రం వివరాలు ఆయన మీడియాకు తెలియచేస్తూ...దేవాకట్టా మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్ ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. నిర్మాత వెంకట్‌కు కూడా ఈ కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం అని వివరించారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ దేవాకట్టా చెప్పిన కథ చాలా బాగుంది. నా పాత్ర అద్భుతంగా మలచడానికి ఆయన ప్రయత్నిస్తుండడంతో నేను ఈ చిత్రానికి చేయడానికి పూనుకున్నాను. హీరోగా నాకు మంచి చిత్రం అవుతుంది, అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అని తెలిపారు.
ప్రస్తుతం చిత్రం క్లైమాక్స్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. నిర్మాత మాట్లాడుతూ ''కథాబలమున్న చిత్రమిది. యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ప్రేమ, వినోదాంశాలకు ప్రాధాన్యముంది. నాగచైతన్యని ఓ సరికొత్త పాత్రలో చూపెట్టబోతున్నామ''న్నారు. ఈ చిత్రంలో సాయికుమార్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











