మెగా ‘స్టార్స్’ మెచ్చిన మెగా హీరోయిన్ ‘మగధీర’ తో...
'మెగా" ఫ్యామిలికి చెందిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ల సరసన ఐటమ్ సాంగ్ చేసిన ఘనత గ్లామర్ క్వీన్ రంభది. చిరంజీవితో 'అల్లుడా..మజాకా, హిట్లర్, బావగారూ బాగున్నారా" వంటి హిట్ చిత్రాలలో నటించి అతనికి హిట్ పెయిర్ గా నిలిచిన రంభ అతనితో 'ఇద్దరు మిత్రులు(హే రుక్కు రుక్కు మామ్), మృగరాజు(రామయ్య పాదాలెట్టి)" చిత్రాలలో ఐటమ్ నెంబర్ లు వేసుకుంది.
అలాగే పవన్ కళ్యాణ్ తొలి చిత్రమైన 'అక్కడ అమ్మాయి-ఇక్రడ అబ్బాయి చిత్రంలో చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మా" అనే ప్రత్యేక గీతంలో నర్తించగా అల్లు అర్జున్ 'దేశ ముదురు" చిత్రంలో అట్టాంటోడే ఇట్టాంటోడే" పాటలో లేటు వయసులోనూ కూసింత ఘాటుగా కనిపించి మురిపించింది. ఇటీవలే ఓ వ్యాపార వేత్తను పెళ్ళాడిన ఈ గ్లామర్ డాల్ త్వరలోనే మెగా ఫ్యామిలికి చెందిన లేటెస్ట్ హిట్ హీరో చరణ్ తోనూ ఓ చిత్రంలో 'మెరుపు" లా కనిపించే ఐటమ్ నెంబర్ లో కనిపించనున్నట్లు వినికిడి. అలా చేస్తే గనుక రంభ 'మెగా" అభిమానులకు ఎప్పటికీ మెగా హీరోయిన్ గానే కాదు మెగా ఐటమ్ గర్ల్ గానూ నిలిచిపోతుంది.


Click it and Unblock the Notifications











