రంభ రాధ్దాంతం

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి దాదాపు పెద్ద హీరోలందరి ప్రక్కన చేసిన రంభ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఆ మధ్య యమదొంగ లో చేసిన ఐటం సాంగు పేలినా పెద్దగా అది అవకాశాలు మోసుకురాలేదు. దాంతో దొంగసచ్చినోళ్ళు కి కమిట్ అయ్యింది. ఆ సినిమా యావరేజ్ రేంజ్ అయినా మళ్ళీ లైమ్ లైట్ లోకి రావచ్చని ఆశపడింది. కాని ఆ చిత్రం ఊహించని రీతిలో ఫ్లాప్ కావటంలో డిప్రెషన్ లో మునిగిపోయిందిట రంభ. ఆ సినిమా నిర్మాతలు రిలీజుకు ముందు తర్వాత కూడా ఆమెను అన్ని రకాలుగా బ్లేమ్ చేస్తున్నారు. అసలే పరిస్థితి బాగోక చిన్న సినిమా అయినా ఒప్పుకున్నందుకు సీన్ రివర్స్ అయినందుకు ఆమె భాధపడుతోంది. అంతేగాక అందరికి ఈ విషయం ఒకటికి పదిసార్లు చెప్పి ఆ నిర్మాతలను ఆడిపోసుకుంటోందిట.అసలే డబ్బులు పోయాయి అని భాధలో ఉన్న వారికి గోరుచుట్టుపై రోకలిపోటులా తయారైంది రంభ.


Click it and Unblock the Notifications











