'రచ్చ'లో రామ్ చరణ్ పేరు, వృత్తి ఏంటి?

By Srikanya

రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ని మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరమ్ మెడికోగా కనిపించనున్నారు. కారు రేసుల బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. అందులో రామ్ చరణ్ పేరు విశ్వం. ఇక ఈ ఆడియోని పిబ్రవరి 20న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఒక పాటను నెట్ లో లీక్ చేసారు. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు.

ఈ సాంగ్ ఇలా సాగుతుంది..."సైలెంట్ చూపులోడు... వైలెంట్ చేతలోడు ... కరెంట్ కండలోడు.. హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ...రచ్చ... అడుగేస్తే సీడెడ్.. ఆంధ్రా.. నైజాం.. రచ్చ... వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ.. హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్... హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" సాగుతుంది. ఈ సాంగ్ లో...బాలీవుడ్ లో 'రాస్కెల్స్‌', 'ఆయేషా'చిత్రాలలో హీరోయిన్ గా చేసిన లీసా హైడెన్‌ రామ్ చరణ్ తో డాన్స్ చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చగా ఆ గీతాన్ని తెరకెక్కించారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X