»   » రియల్ ఎస్టేట్ లో రామ్ చరణ్, మహేష్ ?

రియల్ ఎస్టేట్ లో రామ్ చరణ్, మహేష్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్ధలాల మీద, ప్రాపర్టీస్ మీద పెట్టుబడి పెట్టడం సినీ జనాలకు కొత్తేమీ కాదు. శోభన్ బాబు అప్పట్లో నల్లబంగారం..రియల్ ఎస్టేట్ మీదే పెట్టుబడి పెట్టండి అని చెప్పేవారుట. దాన్ని అప్పటి హీరోలు ఆచరించారో లేదో కానీ ఇప్పుడు స్టార్స్ మాత్రం దాన్ని మనస్పూర్తిగా నమ్ముతున్నారు.

ఈ మధ్యకాలంలో స్దలాల కొనుగోలు విషయంలో పాస్ట్ గా ఉన్నది మహేష్, రామ్ చరణ్ అని చెప్పుకుంటున్నారు. వీరు మొదట హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయి...రేట్లు పడిపోవటంతో వారి దృష్టి ముంబైపై పడిందని తెలుస్తోంది.

Also Read: టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?

Ramcharan,Mahesh Real Estate In Mumbai!

ఈ మేరకు రామ్ చరణ్ , మహేష్ కూడా ముంబైలో స్దలాలుపై ఇన్విస్ట్ చేయటానికి ఆసక్తి చూపెడుతున్నట్లు సమాచారం. తమకు బాలీవుడ్ లో ఉన్న పరిచయాలతో వాళ్లు ముందుకు వెళ్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ముందుగా వారు ముంబై వెళ్లినప్పుడు ఉండటానికి లావిష్ గా ఉండే హౌస్ లు రిచ్ ఏరియాలో కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో సినిమాలు తీసినప్పుడు అక్కడ ఉండటానికే ఈ స్దలాలు అని చెప్తున్నా...దాని వెనక బిజినెస్ రీజన్స్ కూడా ఉన్నాయంటున్నారు. గతంలో నాగార్జున ఇలా దొరికిన ప్రతీ చోటా స్దలాలు కొనుగోలు చేసి బిజినెస్ చేసేవాడని చెప్తారు. ఇప్పుడు ఈ హీరోలిద్దరూ తమ రెమ్యునేషన్ ఈ రియల్ ఎస్టేట్ విషయమై ఇన్విస్ట్ చేస్తున్నట్లు సమాచారం.

English summary
Mahesh and Ramcharan are always looks for new avenues to venture in and investing in property is always considered as safe game.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu