రామ్ చరణ్ చిత్రం హిందీ రీమేక్?
రామ్ చరణ్, భాస్కర్ కాంబినేషన్లో ప్లాన్ చేస్తున్న చిత్రం ఓ హిందీ చిత్రానికి రీమేక్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. బచనా హే హసీనో పేరుతో వచ్చి బాలీవుడ్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న చిత్రానికే కొద్దిగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది. ఇందులో హీరో ప్లే బోయ్ గా కనపిస్తారు. అలాగే రామ్ చరణ్ సరసన జెనీలియా, కృతి కర్భందా హీరోయిన్స్ గా కనిపించనున్నారు.మరో ముంబై మోడల్ ని సైతం ఈ చిత్రంలో నటింపచేయటానకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరంజ్ అని వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ స్క్రిప్టులో కొన్ని మార్పులు చెప్పటంతో భాస్కర్ ప్రస్తుతం ఆ పనిమీదే ఉన్నారు. పరుగు అనంతరం భాస్కర్ రూపొందిస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.
రామ్ చరణ్ జెనీలియా మగధీర బొమ్మరిల్లు భాస్కర్ కృతి కర్భందా ఆరంజ్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ ramcharan maghadheera bommarillu bhaskar orange geniliya kruthi mumbaimodel playboy nagabab


Click it and Unblock the Notifications