ఇక కాచుకోండి.. ఆరోజు రంగస్థలం రచ్చే?: మాస్‌ను ఊపేస్తారా..
Recommended Video

స్టార్ హీరోలు.. స్టార్ మేకర్స్ కలిశారంటే.. భారీ సినిమాలే రూపుదిద్దుకుంటాయి. స్టార్ వాల్యూ రీత్యా పెరిగిపోయిన అంచనాలను అందుకోవడానికి భారీ కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి షెడ్యూల్స్ కూడా మారిపోవచ్చు.. రంగ స్థలం విషయంలోనూ ఇప్పుడిదే జరుగుతోంది.
రాంచరణ్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏడాదిగా నిర్మాణం జరుపుకుంటోంది. అయినా సరే, ఇప్పటిదాకా ఈ సినిమా విడుదలపై ఇంతరవకు క్లారిటీ లేదు. దానికి తోడు సినిమాకు సంబంధించి ఎటువంటి టీజర్, ట్రైలర్ ఇంతవరకు విడుదల కాలేదు. అభిమానుల్లో ఉన్న ఈ అసంత్రుప్తిని గమనించి.. త్వరలోనే టీజర్ విడుదలకు సిద్దమైపోయింది 'రంగస్థలం' యూనిట్.

టీజర్ ఎప్పుడు?
సంక్రాంతి కానుకగా 'రంగ స్థలం' టీజర్ ను ఎట్టకేలకు రంగంలోకి దించాలనుకుంటున్నారట చిత్ర యూనిట్. గతంలో మాదిరిగానే ఈసారి కూడా.. చూడగానే సుకుమార్ మార్క్ కనిపించేలా 'రంగస్థలం' టీజర్ ను రెడీ చేస్తున్నారట.

స్టోరీ రివీల్ చేస్తారా?:
రంగస్థలం సినిమా కథపై ఇప్పటిదాకా ఊహాగానాలే తప్ప.. అధికారికంగా ఎటువంటి వార్తా బయటకు రాలేదు. దీంతో టీజర్ లో నైనా కథకు సంబంధించిన లీక్స్ ఇస్తారా? అన్న ఆసక్తి నెలకొంది.

స్పెషల్ ఎటెన్షన్ కోసం?:
రంగస్థలం సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే చాలామందిని ఆకట్టుకుంది. రాంచరణ్ తన గత చిత్రాల కన్నా పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. ఆయన పాత్రను తెరపై సుకుమార్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. సంక్రాంతికి రిలీజ్ చేయనున్న టీజర్ ద్వారా.. ప్రేక్షకుల్లో స్పెషల్ ఎటెన్షన్ క్రియేట్ చేయాలనే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలా ఉంటుందో:
ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన టీజర్స్ లలో పెద్దగా స్టోరీ రివీల్ చేయకుండా.. జస్ట్ కథా నేపథ్యాన్ని టచ్ చేసేలా టీజర్స్ కట్ చేస్తున్నారు. ఇటీవలి వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', అనుష్క 'భాగమతి' టీజర్స్ లలో ఇది గమనించవచ్చు. రాబోయే రాంచరణ్ టీజర్ కూడా అక్కడికే పరిమితమవుతుందా?.. లేక సుకుమార్ మార్క్ ప్రత్యేకం కాబట్టి.. ఆయన నుంచి ఇంకేదైనా స్పెషల్ ఉంటుందా? అనేది చూడాలి.

రంగస్థలం:
రాంచరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











