రాణా కోసం రామ్ చరణ్ త్యాగం
రామ్ చరణ్ కి క్లోజ్ ప్రెండ్ దగ్గుపాటి రాణా. వీళ్లిద్దరూ ఒకరు షూటింగ్ లు కు మరొకరు వెళ్లటం,సాయింత్రాలు ఇద్దరూ కలిసి ఎంజాయ్ చెయ్యటం చేస్తూంటారు. అయితే వరస ప్లాపుల్లో ఉన్న రాణా సినిమా విడుదల, రామ్ చరణ్ చిత్రం విడుదల ఒక్కరోజే అయ్యింది. ఇద్దరూ మార్చి 23నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే రాణాకి తను పోటీ కాకూడదనే నిర్ణయంతో ముందునుకున్న డేట్ ని మరింత ముందుకు తోసారు రామ్ చరణ్. తన సినిమా రిలీజ్ డేట్ ని రాణా కోసం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రియల్ మొదటి వారంలో తన రచ్చ చిత్రం విడుదల చేయాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఎందుకంటే రాణా, రామ్ చరణ్ సినిమాలు ఒకే రోజు రిలీజైతే గ్యారెంటిగా రామ్ చరణ్ సినిమాకే జనం వెళ్తారు. అటువంటి ప్యాన్ పాలోయింగ్ రామ్ చరణ్ సొంతం. అందులోనూ రాణా సినిమాలు తెలుగులో పెద్ద డైరక్టర్స్ తో చేసినా ఒక్కటీ హిట్ కొట్టలేదు. లీడర్ నామమాత్రంగా ఆడినా, నేనూ నా రాక్షసి చిత్రం డిజాస్టర్ అయ్యింది. హిందీ చిత్రం దమ్ మారో దమ్ కూడా పెద్ద ప్లాప్ గా నమోదైంది. వర్మ డైరక్ట్ చేస్తున్న డిపార్టమెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని స్దితి. ఈ నేపధ్యంలో కొత్త దర్శకుడుతో రాణా రంగంలోకి దిగుతున్నాడు. దాంతో రాణాకి దారి ఇవ్వటానికే రామ్ చరణ్ నిర్ణయించుకన్నాడు. తన స్నేహబంధం నిరూపించుకున్నాడు.


Click it and Unblock the Notifications











