twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ మ్యారేజీకి అల్లు అడ్డు పుల్ల?

    By Staff
    |

    Ram Charan Teja
    అదేంటో గానీ కెరీర్ ప్రారంభం నుంచీ రామ్ చరణ్ తేజ పెళ్ళి పుకార్లును ఎదుర్కొంటూనే ఉన్నాడు. అప్పట్లో తన తొలిచిత్రం చిరుత హీరోయిన్ నేహ తో ప్రేమలో పడ్డాడని పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. తదనంతరం అతనికి అనంతపురం కి చెందిన ఓ పారిశ్రామిక వేత్త కుమారుడుతో పెళ్ళి జరగనుందని వినవచ్చాయి. అయితే అదీ కలసిరాలేదు. కానీ ఆ వార్త నిజమేనని చిరంజీవి సతీమణి సురేఖ కూడా ఆ పెళ్ళి కూతరు ఇంటికి వెళ్ళిందని,వారంతా పెళ్ళికి సముఖంగా ఉన్నారని చెప్పుకున్నారు.

    ఈ నేపద్యంలో రామ్ చరణ్ పెళ్ళికి సంభందించిన ఎంగేజ్ మెంట్ డిసెంబర్ లో జరగవచ్చునని,పెళ్ళి సమ్మర్ అని రూమర్ వచ్చేసింది. కానీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆ పెళ్ళి ఇప్పట్లో లేనట్లేనని రామ్ చరణ్ ఎన్నికలుకి పెళ్ళి మూడ్ లో ఉంటే కష్టమని అల్లు అరవింద్ అడ్డుపుల్ల వేశాడని చెప్తున్నారు. అంతేగాక పెళ్ళి అయితే ఆ హడావిడి మినిమం మూడు నెలలు అయినా ఉంటుంది కాబట్టి చిరు ఎలక్షన్స్ లో నెగ్గి ముఖ్య మంత్రి అయ్యాక అయితే మరీ మంచిదని,ఆ క్రేజ్ వేరని,సి.ఎం కుమారుడు వివాహం అనేది చాలా గొప్ప వెంచర్ అని పార్టీ వర్గాలు అభిప్రాయపడి చిరుతో విన్నవించారని తెలుస్తోంది.దానికాయిన సమ్మతించి అలాగే అని వాయిదా వేశాడనేది ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X