»   » సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్.. ముహూర్తం ఫిక్స్ చేసిన రాంచరణ్!

సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్.. ముహూర్తం ఫిక్స్ చేసిన రాంచరణ్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Sye Raa Narasimha Reddy First Look : Ram Charan Plans To Release It On Chiru's Birthday

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సైరా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆ ముహూర్తం రానే వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

    ఫస్ట్ లుక్ ముహూర్తం అదేనా

    ఫస్ట్ లుక్ ముహూర్తం అదేనా

    ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సైరా ఫస్ట్ లుక్ తో ఫాన్స్ ని ఖుషి చేయాలనీ రాంచరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా అంగీకారం తెలిపాడట.

    తొలి తెలుగు వీరుడి కథ

    తొలి తెలుగు వీరుడి కథ

    తెల్లవారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన వీర గాధని సైరా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి లుక్ లో మెగాస్టార్ చిరంజీవి ఎలా ఉంటాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

    అబ్బురపరిచేలా

    అబ్బురపరిచేలా

    అబ్బురపరిచే పోరాట సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం నుంచి సైరా కొత్త షెడ్యూల్ పార్రంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ 40 రోజుల పాటు సాగనుంది.

    భారీ తారాగణం

    భారీ తారాగణం

    ఈ చిత్రంలో భారీగా స్టార్ కాస్టింగ్ ఉంది. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తమన్నా కీలక పాత్రలో మెరవనుంది. బిగ్ బి అమితాబ్ కూడా కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Date fix for SyeRaa first look. RamCharan wants to release first look on Megastar's birth day
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more