రవితేజ 'వీర' డైరక్టర్ అప్పుడే ఇంకో సినిమా పట్టేసాడు
రవితేజకు ఘోరమైన ప్లాప్ చిత్రం 'వీర'అందించిన దర్శకుడు రమేష్ వర్మ. ఆయన అప్పుడే మరో సినిమా కమిటై అందరినీ అశ్చర్యపరుస్తున్నారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ని డైరక్ట్ చేయటానికి ఓ లైన్ రెడీ చేసుకుని ఆయన ఒప్పించుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. 'వీర' సమయంలో బ్రహ్మానందంతో ఏర్పడ్డ చనువుతో ఈ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కథకు బ్రహ్మానందం కూడా చాలా హ్యాపీ ఫీలై గ్యారెంటీగా హిట్టవుతుందని, తను కూడా కీలకమైన పాత్రను చేస్తానని నిర్మాతకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ ఫైకి వెళ్ళనుందని సమాచారం. స్క్ర్రిప్టు వర్క్ పూర్తవగానే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ఇక 'పల్లకిలో పెళ్ళికూతురు' చిత్రంతో హీరో గా పరిచయం అయిన గౌతమ్ చాలాకాలం గ్యాప్ తరవాత ఈ మద్యనే 'వారేవా..' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా 'వీర' రేంజిలో వీర మరణం పొందింది.


Click it and Unblock the Notifications











