For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్- బండ్ల కాంబో డైరక్టర్ ఫిక్స్.. ఆ ప్లాన్ తో రంగంలోకి!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా వకీల్ సాబ్ మంచి స్పందన తెచ్చుకుంది. గత నెల 9న థియేటర్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కలెక్షన్స్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమా ఒరిజినల్ కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించ లేని పరిస్థితి. ఇక పవన్ ఇప్పటికే మరి కొన్ని సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా కూడా ఒకటి. తాజాగా ఆ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.. ఆ వివరాల్లోకి వెళితే

  వకీల్ సాబ్ ఎంట్రీ

  వకీల్ సాబ్ ఎంట్రీ

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరో రెండు సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టారు. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు ఒకటి కాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ షూటింగ్, ఈ రెండు సినిమాలు కొంత మేర పూర్తి చేశారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో పాటు షూటింగులు కాన్సిల్ చేయడంతో రెస్ట్ మోడ్ లో ఉన్నారు.

  వరుస సినిమాలు

  వరుస సినిమాలు

  ఇక పవన్ ఈ సినిమాలు కాక మరో మూడు సినిమాలు కూడా అనౌన్స్ చేశాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఇక వీరిద్దరితో కాకుండా పవన్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా కూడా ఒకటి అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.

  కరోనా బ్రేక్

  కరోనా బ్రేక్

  పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన కోలుకున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.. నిజానికి పవన్ కు కరోనాతో పాటు ఊపిరితిత్తుల సమస్య కూడా ఏర్పడడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి కొన్నాళ్లపాటు టెన్షన్ రేకెత్తించింది. అభిమానుల ప్రార్థనలతో పవన్ త్వరగానే కోలుకుని మళ్లీ మామూలు మనిషి అయ్యారు. అయితే మరి కొద్ది రోజుల పాటు ఆయన రెస్టు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  లైన్ లోకి బండ్ల

  లైన్ లోకి బండ్ల

  ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తాజాగా ఒక స్క్రిప్ట్ వినిపించినట్లు తెలుస్తోంది. సీనియర్ దర్శకుడు రమేష్ వర్మ రూపొందించిన కథను పవన్ కళ్యాణ్ కి వినిపించడంతో అది పవన్ కళ్యాణ్ కు నచ్చిందని తెలుస్తోంది.. ఈ మేరకు ఇప్పటికే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది.

  రమేష్ వర్మ కధకి ఓకే?

  రమేష్ వర్మ కధకి ఓకే?

  చివరిగా రాక్షసుడు సినిమా తో హిట్ కొట్టిన రమేష్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులవుతుంది. ఆయన ప్రస్తుతం రవితేజ హీరోగా ఖిలాడి అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకోమని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.. దీంతో దాదాపుగా ఆయనే ఈ సినిమా తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  Ys Jagan పై మూవీ ఉంటుంది, Pawan Kalyan ని హ్యాండిల్ చెయ్యలేను - RGV || Filmibeat Telugu
  టెన్షన్ లో ఫ్యాన్స్

  టెన్షన్ లో ఫ్యాన్స్


  రాక్షసుడు కంటే ముందే చాలా సినిమాలు ఆయన చేసినా ఒక్క సినిమా కూడా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన కథకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్తలు తెలియడంతో పవన్ ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన నెలకొంది. ఆయన సరిగ్గా సినిమాను డీల్ చేయగలడా లేదా అనే అంశం మీద ఇప్పుడు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు.

  English summary
  As we all know power Star Pawan Kalyan is doing a movie with bandla Ganesh. Now latest boos Ramesh Verma is going to direct Pawan for bandla Ganesh venture.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X