తారను మోసం చేసిన రామోజీరావు
తెలుగులో హిట్ అయిన 'గమ్యం" సినిమాను ఇటీవల కన్నడంలో జాకోబ్ వర్గీస్ దర్శకత్వంలో నిర్మాత రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై 'సవారి' అనే సినిమా తీసాడు. ఈ చిత్రంలో ముఖర్జీ హీరోగా, గోపి గోపిక గోదావరి కథానాయిక కమలిని ముఖర్జీ కథానాయికగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ లో ఓ ఫైట్ సీను చిత్రీకరించారు. ఓ హోటల్ మీదకి కారు దూసుకెళ్ళే విధంగా సీను ప్లాన్ చేశారు. ఆ కారు ఆ హోటల్ నిర్వహిస్తున్న మహిళపైకి దూసుకు వెళ్ళటంతో ఆమె కాలు విరిగింది. ఈ పాత్రను రీనా అనే జూనియర్ ఆర్టిస్ట్ పోషించింది. వెంటనే రీనాని హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించారు. కానీ కాలు మాత్రం పూర్వ స్థితికి రాలేదు. అయినప్పటికీ ఉషాకిరణ్ సంస్థ ఆమెకు నష్టపరిహారం ఏమీ ఇవ్వకుండా వదిలించుకుంది. దాంతో రీనా జీవితం సమస్యల్లో పడింది. తనకేదైనా న్యాయం చేయమని మొరపెట్టుకుంటోంది.
రామోజీరావు కమిలినీ ముఖర్జీ రీనా సవారి ముఖర్జీ ఉషాకిరణ్ మూవీస్ కారు హోటల్ ramoji rao savari mukerjee kamilini mukerjee reena ushakiran movies car hotel


Click it and Unblock the Notifications