Ramoji Rao: సినిమా పరంగా రామోజీరావు చివరి కోరిక ఇదే.. ఎంత ప్రయత్నించినా తీరలేదుగా!

సుదీర్ఘ కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పలు రకాల వ్యాపారాలు చేయడంతో పాటు జర్నలిజం, సినిమా రంగంలోనూ తనదైన మార్కును చూపించారు ప్రముఖ నిర్మాత రామోజీరావు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగానికి సేవలు అందించిన ఆయన.. ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాసను విడిచారు.

ఈ నేపథ్యంలో ఆయన గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రామోజీరావు పెట్టుకున్న సినిమా పరమైన కోరిక గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ విషయాలను గురించి తెలుసుకుందాం పదండి!

Ramoji Rao Wish to Produce 100 Movies In His Career

అనారోగ్యంతో కన్నుమూత
రామోజీరావు (87) ఈ నెల 5వ తేదీన గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించింది. దీంతో రామోజీరావు ఈరోజు ఉదయం 4.50 గంటలకు ఆస్పత్రిలోనే తుదిశ్వాసను విడిచారు.

Ramoji Rao Wish to Produce 100 Movies In His Career

రామోజీరావుకు సంతాపం
రామోజీరావు మరణంతో సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో రామోజీరావు మరణంపై పోస్టులు పెడుతూ అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు.

సినిమాల్లోనూ సంచలనం
సాధారణ వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన రామోజీరావు.. 1984లో వచ్చిన 'శ్రీవారికి ప్రేమలేఖ' అనే చిత్రంతో నిర్మాతగా మారారు. అక్కడి నుంచి ఆయన ఎన్నో రకాల జోనర్లలో సినిమాలను నిర్మించారు. ఇలా ఇప్పటి వరకూ 85 చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అందులో దేశ వ్యాప్తంగా సంచలనం అయిన చిత్రాలు చాలానే ఉన్నాయని అందరికీ తెలిసిందే.

Ramoji Rao Wish to Produce 100 Movies In His Career

ఎన్నో అవార్డులు సొంతం
రామోజీరావు తన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్పగొప్ప చిత్రాలను నిర్మించారు. అందుకే ఆయనకు ఎన్నో అవార్డులు లభించాయి. ముఖ్యంగా తన కెరీర్‌లో ఈ దిగ్గజ నిర్మాత 'నువ్వే కావాలి' చిత్రానికి నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే, నాలుగు ఫిల్మ్‌ఫేర్స్, ఐదు నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. వీటితో పాటు పద్మ విభూషణ్ పురస్కారం తీసుకున్నారు.

సెంచరీ చేయాలని ప్లాన్స్
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో రామోజీరావు నిర్మాతగా అన్ని భాషల్లో కలిపి 85 చిత్రాలను నిర్మించారు. ఈ సంఖ్యను 100కు చేర్చాలని ఆయన ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే కోవిడ్‌కు ముందూ ఆ తర్వాత ఆయన ఎన్న ప్రయత్నాలు కూడా చేశారు. ఇలా కొత్త సినిమాలు చేయడం కోసం ఎంతో మంది దర్శకులకు, హీరోలకు అడ్వాన్స్‌లు కూడా ఇచ్చినట్లు తెలిసింది.

Ramoji Rao Wish to Produce 100 Movies In His Career

కోరిక తీరకుండా మరణం
రామోజీరావుకు నిర్మాతగా 100 చిత్రాల మార్కును దాటాలని కోరిక ఉండేది. ఆయన ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ, ఇప్పుడు ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. దీంతో ఇప్పుడీ అంశం తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఫ్యూచర్‌లో 'ఉషా కిరణ్ మూవీస్' బ్యానర్ వంద సినిమాల మార్కును చేరుతుందో లేదో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X