జూనియార్ ఎన్టీఆర్ కోసం అమ్మాయి వేటలో పడ్డ రామోజీరావు!
ముందు నుండి తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్ కుటుంబానికి ఆప్తుడిగా కొనసాగుతూ వస్తున్న ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరో ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దమౌతున్నారు. అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయాలలోను, స్వర్గీయ ఎన్టీఆర్ కి సరైన వారసుడిగా అందరూ భావిస్తున్న జూ.ఎన్టీఆర్ వివాహం తన కుటుంబములోని అమ్మాయితో జరిపించాలని ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ముందు నుండి జూనియర్ పై రామోజీకి ప్రత్యేక అభిమానం ఉండటంతో పాటు ఎప్పటికైనా తెదేపా పగ్గాలు చేపట్టే అవకాశాలు అతనికే ఉన్న ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నట్టాగా తెలిసింది. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా రామోజీ ఈ విషయంలో సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా పలువురు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











