రామోజీ కొత్త సినిమా అదా?

By Staff

Closer
నచ్చావులే చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఉషాకిరణ్ మూవీస్ వయస్కాతం పేరుతో మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. మనీ చిత్రంతో తెలుగునాట కామిడీకి కొత్త రూపునీ, ఊపునీ ఇచ్చిన శివనాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వ బాద్యతలు నిర్వహించనున్నారు. ఆ చిత్రానికి పూజా కార్యక్రమాలు సైతం సైలెంట్ గా జరిగిపోయాయి. ఇక ఈ చిత్రం హాలీవుడ్ కామిడీ క్లోజర్ కథ ఆధారంగా కథ తయారు చేసినట్లు తెలుస్తోంది. రెండు జంటలు, విడివిడిగా వేర్వేరుగా ప్రేమలో పడటాన్ని ఈ చిత్రం చూపిస్తుందని తెలుస్తోంది.

తాను వేరే వారితో ప్రేమలో పడ్డానని ఎవరికి వారు తమ బోయ్ లేక గర్ల్ ప్రెండ్స్ కి చెప్పుకోవాల్సి రావటం, సున్నితంగా ఉండే ఆ సమస్యను డీల్ చేయటం లో కామిడీ పుట్టుతుందని అంటున్నారు. నేటి యూత్ మనో భావాలకు తగినట్లు ఈ చిత్రం తయారుకానున్నట్లు చెప్తున్నారు. కామిడీ బేస్ తో యూత్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం కథ నడుస్తుందని వినపడుతోంది. పరిమిత బడ్జెట్ లో దాదాపు రామోజీ ఫిలిం సిటీలో పూర్తయ్యేటట్లు, అంతా కొత్త వారితో ఈ చిత్రాన్ని రూపొందించటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా హిట్టయితే ఇది ఒక మంచి సంప్రదాయంగా మిగతా సంస్ధలు కూడా అనుసరించే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X