రాము అంత పని చేసాడా!!
సినిమాల్లో హీరో హీరోయిన్లుగా రాణించాలంటే ఫిట్ నెస్ మంత్రాన్ని మరవకూడదు. కాస్త లావయినా అవకాశాలు రావు మరి! ఈ విషయాన్ని వర్థమాన నటి ప్రియాంక కొఠారి బాగా అర్థం చేసుకున్నట్టుంది...అందుకే అడవుల్లో వున్నా వ్యాయామం చెయ్యాలని పట్టుబట్టింది...
ఇంతకీ విషయమేమిటంటే ఈ రోజే విడుదలైన రామ్ గోపాల్ వర్మ సినిమా 'అడవి'లో నాయికగా ప్రియాంక నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను దాదాపు శ్రీ లంక అడవుల్లోనే చిత్రీకరించారు. అలాంటి కీకారణ్యంలో, క్రూర మృగాల మధ్య 40 రోజులు నటించడానికి అభ్యంతరం చెప్పని ప్రియాంక వ్యాయామం చెయ్యడానికి జిమ్ లేకపోవడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇదే విషయాన్ని రాముకు చెప్పింది. దీంతో వెంటనే స్పందిచిన రాము ముంబై నుండీ శ్రీ లంకకు...అక్కడ నుండీ అడవుల్లోకి సుమారు 60 కిలోమీటర్ల దాకా వ్యాయామ పరికరాలను తెప్పించాడు. దీనికి కావలసిన అన్ని అనుమతులు తీసుకోవడం దగ్గర నుంచీ ఆ రిస్క్ మొత్తం భరించాడు.
ఇవన్నీ విన్న వాళ్ళు మాత్రం రాము ప్రియాంక పై ప్రత్యేక శ్రద్ధ చూపించడం పై చెవులుకొరుక్కుంటున్నారు.


Click it and Unblock the Notifications











