twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌‌తో రమ్యకృష్ణ.. కాంట్రవర్సీ రోల్ కోసం భారీ రెమ్యునరేషన్?

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతోంది. ఇక అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన కొన్ని కాంట్రవర్సీ విషయాలను మిక్స్ చేయబోతున్నారు. అలాంటి సినిమాలో నటించడానికి రమ్యకృష్ణ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ పాత్ర కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

    మెగా హీరో సినిమాలో రమ్యకృష్ణ

    మెగా హీరో సినిమాలో రమ్యకృష్ణ

    పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సినిమాల్లో రియల్ లైఫ్ కి సంబంధించిన పాత్రలు కనిపిస్తే ఆ సినిమాలకు చాలా ఈజీగా బజ్ క్రొయేట్ అవుతుంది. ఇక రమ్యకృష్ణ లాంటి సీనియర్ టాలెంటేడ్ నటీమణులు ఆ పాత్రల్లో కనిపిస్తే మామూలుగా ఉండదు. అది కూడా ఒక మెగా హీరో సినిమాలో ఆమె మహిళా నేతగా కనిపించబోతోంది. ఇక ఆ సినిమాకు దర్శకుడు మరెవరో కాదు..దేవకట్టా

    పవర్ఫుల్ పొలిటికల్ నేతగా..

    పవర్ఫుల్ పొలిటికల్ నేతగా..

    వెన్నెల, ప్రస్థానం సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవకట్టా నెక్స్ట్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో రానుంది. ఇక అందులో జగపతిబాబు బాబు, ఐశ్వర్య రాజేష్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక వారందరి పాత్రల కంటే పవర్ఫుల్ గా శివగామి కనిపించనున్నట్లు టాక్.

    స్టార్ హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్

    స్టార్ హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్

    బాహుబలి సినిమా నుంచి రమ్యకృష్ణ చేస్తున్న పాత్రలకు భారీ స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో ఆమెకున్న డిమాండ్ కూడా గట్టిగానే ఉంది. ఒక సినిమాకు ఒక్కరోజు కాల్షీట్ కి 8 నుంచి 10లక్షల రూపాయల వరకు తీసుకుంటోందట. ఇక 10రోజులు దాటితే ఆ లెక్క కోటి వరకు వెళుతోంది. అంటే ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకొనున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Power Star Pawan Kalyan Clap For Sai Dharam New Movie
    కొంత తగ్గించినా కూడా..

    కొంత తగ్గించినా కూడా..

    ఇక దేవకట్ట సినిమా కోసం ఆమె 15రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక నిర్మాత ఫీలింగ్ తో ఆమె ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని కొంత తగ్గించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె రెమ్యునరేషన్ కోటికి పైగానే ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. పైగా ఆమె చేస్తున్న పాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సెటైర్ వేసే విధంగా ఉంటుందని టాక్ వస్తోంది. ఏదేమైనా రమ్యకృష్ణ ఒకప్పుడు హీరోయిన్ గా కంటే కూడా ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ తోనే అత్యదిక ఆదాయాన్ని అందుకుంటోందని చెప్పవచ్చు.

    English summary
    It came as a shock to everyone that in a recent interview, director Devakatta said, "I was deceived once and I will never be deceived again." It is learned that Devakatta has recently made some controversial comments on Twitter. The presiding director tweeted that his story had been copied again by a big producer, but this time there was nothing left to take legal action. The producer also responded to the matter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X