పొలిటీషియన్‌గా మారబోతున్న రమ్యకృష్ణ.. ఇక విశ్వరూపమే! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
సినీ తారలు పొలిటీషియన్‌గా మారడమనేది కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే ఎందరో స్టార్ హీరోహీరోయిన్లు పొలిటీషియన్ అవతారమెత్తారు. ఇప్పుడు అదే బాటలోకి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆమె పొలిటీషియన్ గెటప్ ఎక్కడ చూడబోతున్నాం? ఆ వివరాలేంటి? ఓ లుక్కేద్దామా..

స్పెషల్ ఇమేజ్.. రమ్యకృష్ణ స్టార్ స్టేటస్
దక్షిణాదిలో సినిమాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రమ్యకృష్ణ. యంగ్ ఏజ్‌లో ఉండగానే అందరు అగ్ర హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ కొట్టేసిన ఈమె.. తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. అప్పట్లో రమ్యకృష్ణ అందాలు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి టాలీవుడ్ లోకం ఊగిపోయింది.

సెకండ్ ఇన్నింగ్స్.. పవర్‌ఫుల్ యాక్ట్రెస్
ఇక ఈ మధ్యకాలంలో పవర్‌ఫుల్ రోల్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రాణిస్తోంది. దక్షిణాదిలో పవర్‌ఫుల్ యాక్ట్రెస్ ఎవరంటే ఠకీమని రమ్యకృష్ణ అని చెప్పుకునే రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకుంది. రాజమౌళి ‘బాహుబలి' సినిమాలో ఆమె పోషించిన రాజమాత శివగామీదేవి రమ్యకృష్ణను అందలమెక్కించింది.

పవర్‌ఫుల్ లేడీ.. స్ట్రాంగ్ పొలిటీషియన్
దీంతో ఈ తరహా పాత్రలకు మళ్లీ డిమాండ్ వచ్చి.. రమ్యకృష్ణకు అవకాశాలు పెరిగాయి. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు సూపర్ క్రేజ్ దక్కింది. తెలుగులో చివరగా ‘శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో పవర్‌ఫుల్ లేడీగా, అత్తగా రమ్యకృష్ణ కనిపించింది. ఇక ఇప్పుడు పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా అలరించేందుకు రెడీ అవుతోంది.

పవన్ కళ్యాణ్ చేత స్టార్ట్.. రమ్యకృష్ణ విశ్వరూపం
సాయి ధరమ్ తేజ్ హీరోగా దవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ రోల్ కీలకంగా ఉండనుందట. స్క్రిప్ట్ ప్రకారం ఆమె పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా కనిపించనుందని తెలుస్తోంది. ఈ పాత్రలో రమ్యకృష్ణ నట విశ్వరూపం చూడనున్నామని టాక్. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొబ్బరికాయ కొట్టి ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Recommended Video

మెగా మేనల్లుడితో పొలిటికల్ డ్రామా
సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 14వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











