SSMB28: మహేశ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలి రేంజ్‌ పవర్‌ఫుల్ రోల్‌లోనే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది హ్యాండ్సమ్ హీరోలు ఉన్న విషయం తెలిసిందే. అందులో సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా వెలుగొందుతోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకడు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం.. అదిరిపోయే యాక్టింగ్‌తో తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే హిట్ల మీద హిట్లు కొడుతూ తన రేంజ్‌ను, మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటున్నాడు. ఈ ఉత్సాహంతోనే మహేష్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సినిమా చాలా రోజుల క్రితం ప్రారంభమైంది. ఆ వెంటనే దీనికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. ఇక, ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దీన్ని శరవేగంగా జరుపుతూ వస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజమౌళి మూవీ షూటింగ్‌కు సన్నద్ధం అవ్వాలని మహేష్ బాబు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే త్రివిక్రమ్ సినిమాను ఏమాత్రం బ్రేకులు లేకుండా పూర్తి చేయబోతున్నాడట. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

Ramya Krishnan Key Role in Mahesh Babu and Trivikram Movie

క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో ఎంతో మంది స్టార్లు భాగం కాబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎంతో మంది వేరే ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పవర్ఫుల్ పాత్రలో నటించేందుకు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణను తీసుకున్నట్లు తాజాగా తెలిసింది. వాస్తవానికి ఈ పాత్ర కోసం బాలీవుడ్ భామలను తీసుకోవాలని అనుకున్నా రమ్యకృష్ణకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఆమెకే గురూజీ ఓటు వేసినట్లు తెలిసింది. ఆమె పాత్ర బాహుబలి రేంజ్‌లోనే ఉంటుందని సమాచారం.

ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X