Ramya Krishnan: ఒక్క ఎపిసోడ్ కు అన్ని లక్షలా?.. రమ్య కృష్ణ రేంజ్ మాములుగా లేదుగా!

రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆమె అందం, అభినయం, నటనను ప్రేక్షకులు ఇప్పుడు అప్పుుడే మరిచిపోలేరు. ఎందుకంటే ఆమె ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకే హైప్​ తీసుకొస్తుంది. నీలాంబరిగా ద్వేషం చూపించిన, శివగామిగా రాజ్యాన్ని పాలించిన, దేవతగా అవతారం ఎత్తినా, గ్లామర్​ లుక్​లో అందాలు ప్రదర్శించిన.. ఇలా ఎందులోనైనా లుక్స్​తో, నటనతో అదరగొట్టడం ఒక రమ్యకృష్ణకే చెల్లింది. ప్రస్తుతం మంచి ప్రాధాన్యత పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్న రమ్యకృష్ణ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇందుకోసం రమ్యకృష్ణ తీసుకునే పారితోషికం హాట్ టాపిక్ గా మారింది.

 ఆహా వేదికగా..

ఆహా వేదికగా..

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఇటీవల డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే డ్యాన్స్ ఐకాన్ పేరుతో రియాలిటీ డ్యాన్స్ షోను తీసుకొచ్చింది ఆహా. ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఓంకార్ వ్యవహరించగా మెంటార్ గా శ్రీముఖి, హీరోయిన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

శేఖర్ మాస్టర్ తోపాటు..

శేఖర్ మాస్టర్ తోపాటు..

అలాగే న్యాయ నిర్ణేతలుగా పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తోపాటు రమ్యకృష్ణ వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలను ఇదివరకే విడుదల చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ షోకి జడ్జిగా వ్యవహరించేందుకు రమ్యకృష్ణ భారీ పారితోషికాన్నే అందుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

 న్యాయ నిర్ణేతగా ఒక్కో ఎపిసోడ్ కు..

న్యాయ నిర్ణేతగా ఒక్కో ఎపిసోడ్ కు..

ఓంకార్ యాంకర్ గా చేస్తున్న ఈ డ్యాన్స రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్ ప్రోగ్రామ్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించేందుకు గానూ.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. ఒక్కో ఎపిసోడ్ కు సుమారు రూ. 4.5 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

దాదాపు రూ. కోటి వరకు..

దాదాపు రూ. కోటి వరకు..

ఒకవేళ ఇదే నిజమైతే.. ఇలాంటి రియాలిటీ షోకి ఎవరు ఈ రేంజ్ లో పారితోషికం అందుకోలేదని చర్చించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్న రమ్యకృష్ణ రోజుకు రూ. 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట. అంటే ఒక సినిమాకు పది రోజులు పని చేస్తే రూ. కోటి వరకు అందుకునే అవకాశం ఉందన్నమాట.

 స్టార్ హీరోయిన్ స్థాయిలో..

స్టార్ హీరోయిన్ స్థాయిలో..

ఇక ఇటీవల విడుదలై డిజాస్టర్ గా నిలిచిన లైగర్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తల్లిగా నటించింది రమ్యకృష్ణ. ఈ పాత్ర కోసం శివగామి రూ. 1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. దాదాపు ఓ స్టార్ హీరోయిన్ పారితోషికం అందుకున్నంతగా శివగామి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో రమ్యకృష్ణ స్థాయి ఏంటో అర్థమవుతోంది.

ప్రాధాన్యత గల పాత్రలతో..

కాగా ఇదిలా ఉంటే ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి స్టార్​ హీరోయిన్​గా వెలుగొందిన రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ బాటలో పయనిస్తోంది. బాహుబలిలో శివగామిగా అలరించిన ఆమె బంగార్రాజు, రొమాంటిక్​ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X