»   » నిర్మాతకు ట్విస్ట్ ఇచ్చిన రమ్యకృష్ణ?

నిర్మాతకు ట్విస్ట్ ఇచ్చిన రమ్యకృష్ణ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగబాబు ప్రధాన పాత్రలో ఈ మధ్యన 'సర్కార్' అనే సినిమా ఓ చిన్న సినిమా ప్రారంభమైంది. ఆ నిర్మాతలు తెలివిగా ఆ సినిమా ఆయేషా హత్య కేసు ఆధారంగా చేస్తున్నామని ప్రచారం చేస్తూ మీడియోని ఆకర్షింప ప్రయత్నించారు. అలాగే ఆ సినిమాలో నాగబాబు కి జోడీగా రమ్యకృష్ణనీ తీసుకున్నారు. ఇద్దరినీ పోస్టర్స్ వేస్తే జనాలు థియోటర్ కి వస్తారనేదానికన్నా శాటిలైట్ రైట్స్ కోసం ఈ పని చేసారు. అలాగే ఈ సినామాలో సుహాసిని (చంటిగాడు ఫేమ్) తీసుకున్నారు.అంతా బాగానే ఉంది కానీ నాగబాబు...తన సోదరుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయటంతో ఆ ప్రచారంలో పాల్గొని డేట్స్ ఇచ్చిన ప్రకారం షూటింగ్ కి అటెండు కాలేదు.

కానీ అడిగే స్ధితి ఆ చిన్న నిర్మాతకూ లేదు. సరే అని మరో సారి షూటింగ్ పెట్టుకుంటే ఆ కాంబినేషన్ లో ఉన్న రమ్యకృష్ణ ట్విస్ట్ ఇచ్చిందిట. మీకు తెలుసుగా నేను కాల్షీట్ కి రెండు లక్షలు తీసుకుంటాను..మీకు ఇచ్చిన డేట్స్ అయిపోయాయి. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్ గా మనీ పే చేసి కాల్షీట్స్ తీసుకోండి అని నిక్కచ్చిగా చెప్పిందిట. డైలమాలో పడ్డ నిర్మాత అర్ధంకాని స్ధితిలో పడ్డాడుట. ఈలోగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో .. ఏం ఎగ్రమెంటు జరిగిందో ఏమో గానీ ..సినిమా పూర్తి చేసారని తెలిసింది. ఇక ఈ సినిమా మనోజ్ నైట్ శ్యామలన్ సూపర్ హిట్ సిక్స్ సెన్స్ మక్కీకి మక్కీ కాపీ అని తెలిసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X