అద్భుతమైన రోల్.. అదిరిపోయే రెమ్యునరేషన్.. ఎంత డిమాండ్ చేస్తున్నారంటే

బాహుబలి అనంతరం దేవసేనగా సౌత్ లొనే కాకుండా దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ. ఆమె సౌత్ లో బాషాభేదం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఒకప్పుడు రమ్యకృష్ణ స్టార్ కథానాయికగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఆమెకు మరింత డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. పారితోషికం విషయంలో కూడా రమ్యకృష్ణ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇకపోతే ఈ సీనియర్ నటి త్వరలోనే ఒక బోల్డ్ క్యారెక్టర్ లో ఎవరు ఊహించని విధంగా దర్శనమివ్వబోతోందట.

 ఆ స్పెషల్ పాత్ర కోసం..

ఆ స్పెషల్ పాత్ర కోసం..

సినిమాలో ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్స్ ఉన్నా కూడా సపోర్టింగ్ రోల్స్ లేకపోతే ఆ సినిమాలో కిక్కే ఉండదు. కథలో కీలకమయ్యే ఇంపార్టెంట్ రోల్స్ లో కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రతి సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న రమ్యకృష్ణ ఇప్పుడు మరో స్పెషల్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో తెరకెక్కబోయే నితిన్ అందాదున్ తెలుగు రీమేక్ లో రమ్యకృష్ణ టబు చేసిన పాత్రలో కనిపించనుందట.

బోల్డ్ రోల్..

బోల్డ్ రోల్..

బోల్డ్ పాత్రల్లో సాధారణంగా హాట్ నెస్ తో రెచ్చిపోతే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. అయితే ఆ విధంగా కాకుండా యాక్టింగ్ స్కిల్స్ తో పాటు స్టార్ డమ్ ని పక్కన పెట్టి చాలా తెగించి నటించాల్సి ఉంటుంది. ఇక అందాదున్ లో టబు స్టైల్ ల్లో నటించాలి అంటే రమ్యకృష్ణ లాంటి హోమ్లీ నటికి ఇబ్బందే అని చెప్పాలి. కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించాలి అంటే ఆమె స్టార్ రేంజ్ ని పక్కనపెట్టాలి.

రెమ్యునరేషన్ డోస్..

రెమ్యునరేషన్ డోస్..

డైలీ పేమెంట్ తీసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ఈ సీనియర్ బ్యూటీ ఓ విధంగా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదట. మొన్నటి కంటే ఇప్పుడు పాత్రను బట్టి రెమ్యునరేషన్ డోస్ పెంచిందట. ఆ రెమ్యునరేషన్ కొంత మంది స్టార్ హీరోయిన్స్ తీసుకునేదానికంటే చాలా ఎక్కువని తెలుస్తోంది. పాత్రల విషయంలో రమ్యకృష్ణ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తోంది. తనకి నచ్చకుంటే నచ్చలేదని మొహం మీదే చెప్పొస్తోందట.

Recommended Video

Hero Nithiin Donated 10 Lakhs Each To Telugu States
త్వరలోనే షూటింగ్ స్టార్ట్..

త్వరలోనే షూటింగ్ స్టార్ట్..

అందాదున్ తెలుగులో చేయాలని చాలా మంది కుర్ర హీరోలు ట్రై చేశారు. ఫైనల్ గా నితిన్ రీమేక్ హక్కుల్ని సొంతం చెసుకున్న విషయం తెలిసిందే. రీమేక్ కోసం డైరెక్టర్ గా మెర్లపాక గాంధీని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే గతంలో ఈ దర్శకుడు కృష్ణార్జున యుద్ధం వంటి డిజాస్టర్ సినిమా తీసినప్పటికి నితిన్ ఈ కమర్షియల్ దర్శకుడిని ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. దర్శకుడు అందాదున్ కథను పూర్తిగా తన స్టైల్ లోకి మార్చి కొత్త స్క్రిప్ట్ రెడీ చేయడంతో నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేయాలని నితిన్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X