లీడర్ కాంబినేషన్ రిపీటవుతోంది..వివరాలు
'లీడర్'తో తెలుగు తెరకు పరిచయమైన రానా, రిచా గంగోపాధ్యాయ కాంబినేషన్ మరో సారి కనువిందు చేయబోతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఫిబ్రవరి 2011 లో మొదలుకానుంది. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీ అని, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే తరహాలో సాగనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇక రానా ప్రస్తుతం 'నేను నా రాక్షసి' చేస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోంది.
నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రానా ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించనున్నారు. అలాగే ఇలియానా కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపిస్తే, ముమైత్ ఖాన్ చిత్రం సెకెండాఫ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. కథా పరంగా ఇదో డిఫెరెంట్ కాన్సెప్ట్ అని, ఫిల్మ్ నాయర్ జనర్ కి చెందిన కధాంశమని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ముగ్గరు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. వారు విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు.


Click it and Unblock the Notifications











