వెంకటేష్ సూపర్ హిట్ బొబ్బిలిరాజా కి సీక్వెల్ రూపొందించటానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో వెంకీ హీరోగా చేయటం లేదని సమాచారం. సురేష్ బాబు తనయుడు రాణా ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతాడని తెలుస్తోంది. అలా చేయటం ద్వారా తమ కుటుంబం నుంచి వచ్చే హీరో..వారసుడు అని స్పష్టంగా చెప్పినట్లుఅవుతుందని..అందువల్ల మొదటి సినిమానే..అబిమానులు మోసుకుంటూ వెళ్తారనేది సురేష్ బాబు ప్లాన్ గా చెప్తున్నారు. అయితే రామానాయుడు దీనిని వ్యతిరేకిస్తున్నాడని...నాగ చైతన్యలా భారీ బడ్జెట్ తో కొత్త కథతో వస్తే బాగుంటుందని అంటున్నారని సమాచారం. రాణా మాత్రం తండ్రి మాట వైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. ఇక చేస్తే ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ గా చేస్తాను అన్నాడని అంటున్నారు.