ప్రభాస్-రాజమౌళి చిత్రానికి విలన్‌గా మారిన రాణా?
హైదరాబాద్ : 'ఈగ' చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టు తెరకెక్కేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రభాస్ హీరోగా 'ఛత్రపతి' లాంటి బిగ్ హిట్ అందించిన రాజమౌళి, మరోసారి ప్రభాస్ కాంబినేషన్లో భారీ చిత్రాన్ని ప్రేక్షుకుల ముందుకు తెచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించి ఓ ప్రచారం సాగుతోంది. ఈచిత్రంలో యంగ్ హీరో రాణా విలన్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడని ఆ వార్తల సారాంశం. ఇటీవలే రాజమౌళి రాణాను కలిసి కథ వివరించాడని, డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఇష్టపడే రాణా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
అయితే...ఇదంతా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ఓ పుకారు మాత్రమే. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఈ వార్తను నమ్మలేం. గతంలో రాజమౌళి-ప్రభాస్ సినిమాపై అనేక వార్తలు ప్రచారంలోకి రావడం, రాజమౌళి వాటిని ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న రాణా విలన్ పాత్ర చేసే అవకాశం లేదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.
ఇతర వివరాల్లోకి వెళితే....
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 'మిర్చి' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. త్వరలో ఈచిత్రం విడుదల తేదీ ఖరారు కానుంది. ఇక రాణా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది.


Click it and Unblock the Notifications











