ఆ ఐడియా... రాణా, బివిఎస్ రవి దశ మార్చేనా?
ఇందులో రాణాను పోలీస్ ఆఫీసర్‌గా చూపెట్టనున్నట్లు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈచిత్రం ప్లాన్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. బివిఎస్ రవి ఇటీవల విడుదలైన దేనికైనారెడీతో పాటు, కింగ్, సత్యం లాంటి చిత్రాలకు స్క్రిప్టు మరియు డైలాగ్ రైటర్‍గా పని చేసారు.
ఆ మధ్య గోపీచంద్ హీరోగా వాంటెడ్ సినిమాకు దర్శకత్వం వహించినా సక్సెస్ కాలేక పోయారు. ఈ సారి రాణాను హీరోగా పెట్టి ట్రై చేసి.... హిట్టు కొట్టాలని, అదే విధంగా రాణాకు హిట్ అందించాలని ఉవ్విల్లూరుతున్నాడట. అయితే దీనిపై బివిఎస్ రవిగానీ, రాణా గానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం ఇది ఫిల్మ్ నగర్ నుంచి ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న గుసగుస.
రాణా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'బహుబలి' చిత్రం చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. మరో వైపు అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో కూడా రాణా ఆమె భర్త పాత్ర చేయబోతున్నాడు.


Click it and Unblock the Notifications












