రానా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. దగ్గుబాటి ఇంట ఇక సందడే
రానా దగ్గుబాటి మిహీక బజాజ్‌ల బంధం ఎప్పుడు బయట పడిందో అప్పటి నుంచి వీరిద్దరి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తూనే ఉంది. లాక్‌డౌన్‌కు ముందే ప్రేమ పుట్టిందని, అంతకు ముందే పరిచయం ఉన్నా గానీ ఈ మధ్యే ప్రేమ మొదలైందని చెప్పుకొచ్చాడు. లాక్ డౌన్‌లోనే తన ప్రేమ ఫలించిందని తెలిపిన రానా.. ఆమె అంగీకరించిన తరువాతే యస్ అని ప్రకటించానని పేర్కొన్నాడు. ఇక అప్పటి నుంచి రానా-మిహికల గురించి నిత్యం ఏదో వార్త హైలెట్ అవుతూనే ఉంటుంది.

మిహీక గురించి వెదుకులాట..
మిహీక బజాజ్ తనకు యస్ చెప్పిందని రానా ప్రకటించిన క్షణం నుంచి తెలుగు ప్రేక్షకులు సర్ఛ్ చేయడం మొదలు పెట్టారు. మిహీక ఎవరై ఉంటారు? ఏం చేస్తుంటారని అంతా ఆత్రుతగా వెదికారు. వెడ్డింగ్ ప్లానర్, ఈవెంట్‌లు చేసే మిహీక.. వెంకటేష్ కూతురు ఆశ్రీత స్నేహితురాలు.

రోకా ఘనంగా రోకా ఈవెంట్..
రానా మిహీకల రోకా ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన విషయాలను చర్చించుకోవడానికి ఇరు కుటుంబాలు ఒక చోట కలిసిన ఈ రోకా ఈవెంట్‌లోని ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. సంప్రదాయ దుస్తుల్లో రానా, మిహికలు ఎంతగా ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే.

మిహీక పచ్చబొట్టు..
రానా పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్న మిహీక దాని అర్థాన్ని చెప్పి ప్రేమను చాటిచెప్పింది. మ్యాథమెటిక్స్‌లో ఇన్ఫినిటీ సింబల్ (Ꝏ)లో R, M అక్షరాలను ఇరికించారు. తమది కూడా అనంతమైన ప్రేమ అని చెప్పుకొచ్చింది. రానా, మిహీకల అనంత ప్రేమకు చిహ్నమైన టాటూ అని కామెంట్ చేసింది.
Recommended Video

పెళ్లి డేట్ ఫిక్స్..
ఇటీవల రెండు కుటుంబాల వారు కలిసి రోకా వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏడాదిలోపే రానా, మిహీక పెళ్లి ఉంటుందని సురేశ్‌బాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ వర్గాల్లో వినపడుతోన్న సమాచారం మేరకు ఆగస్ట్ 8న హైదరాబాద్‌లో రానా, మిహీక పెళ్లి జరుగుతుందని టాక్. మరి వీటిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











