రానా దగ్గుబాటి మరో మల్టీస్టారర్.. మొదటి సారి ఆ హీరోతో మరో డిఫరెంట్ మూవీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మల్టీస్టారర్ కథలకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఏమాత్రం అభిప్రాయ భేదాలు లేకుండా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యంగా నేటి తరం యువ హీరోలు ప్రత్యేకంగా కథలను రెడీ చేసుకుని మరీ మల్టీస్టారర్ సినిమాలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక త్వరలోనే రానా దగ్గుబాటు కూడా మరో బిగ్గెస్ట్ మల్టిస్టారర్ ప్రాజెక్టును తెరపైకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే రానా దగ్గుబాటి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచినటువంటి అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఆ ప్రాజెక్టు పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వచ్చే ఏడాది 2022 సంక్రాంతి కి రాబోతున్న ప్రాజెక్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సమానంగా రానా దగ్గుబాటి కూడా బలమైన పాత్రలో కనిపించబోతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల పరంగా అదే మరొక బాహుబలి లాంటి ప్రాజెక్టు అని చెప్పవచ్చు.

 Rana daggubati another different multi starrer with young hero,

ఎందుకంటే ఇద్దరు హీరోలు కూడా సినిమాలో భారీ స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. దానికి తోడు త్రివిక్రమ్ మాటలతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేయబోతున్నాడు. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా మొత్తం కూడా త్రివిక్రమ్ దర్శకత్వం పర్యవేక్షణలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రానా దగ్గుబాటి తన బాబాయ్ తరహాలోనే ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక త్వరలోనే ఫ్యామిలీ హీరో శర్వానంద్ తో కూడా ఒక మీడియం బడ్జెట్లో విభిన్నమైన కథను తెర పైకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులో రానా దగ్గుబాటి ఇద్దరు కూడా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడని టాక్ వస్తోంది. ఇక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు ఎవరనే విషయంలోకి వెళితే ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో సహాయ దర్శకుడిగా చేసినటువంటి ఒక యువ దర్శకుడు హ్యాండిల్ చేయబోతున్నట్లు సమాచారం. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని దగ్గుబాటి రా ఆ చాలా కాన్ఫిడెన్స్ తో ఒప్పుకున్నట్లు సమాచారం. శర్వానంద్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ హీరో హీరో అల్లరి నరేష్ తో రెండు సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు రానా దగ్గుబాటి తో కూడా సరికొత్త ప్రాజెక్టుని తెర పైకి తీసుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X