మరో మల్టీస్టారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా.. పెళ్లి అయిపోగానే..?
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన రీమేక్ సినిమా ఫైనల్ గా ఎదో ఒక హీరోకు ఫిక్స్ అవుతుంది. రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న తరువాత నిర్మాతలు ఆ కథను వీలైనంత త్వరగా తెరకెక్కించాలని అనుకుంటారు. అయితే ఇటీవల చాలా మంది హీరోలు వదిలేసిన ఒక ప్రాజెక్ట్ రానా, రవితేజ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది.
అయ్యప్పనమ్ కోషియం అనే మలయాళం సినిమా తెలుగు రీమేక్ హక్కులను సీతారా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. అయితే చాలా రోజులుగా ఈ సినిమా రీమేక్ గురించి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ గా రానా రవితేజ ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రలో రానా నటిస్తుండగా.. రవితేజ, బిజూ మీనన్ క్యారెక్టర్ చేయబోతున్నాడట.

లాక్ డౌన్ కారణంగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఈ మలయాళం సినిమాను చాలా మంచి వీక్షించారు. తప్పకుండా తెలుగు ఆడియేన్స్ కి కూడా నచ్చుతుందని రానా, రవితేజ అనుమానం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇక రానా దగ్గుబాటి పెళ్లి అనంతరం ఈ రీమేక్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని నిర్మాతతో చర్చించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











