Daggubati Abhiram Marriage Fix: ఆ అమ్మాయితో దగ్గుబాటి వారసుడి పెళ్లి ఫిక్స్... ఎప్పుడు జరగనుందంటే?

దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్ ఈ ఏడాది అహింస అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇదిలా ఉంటే అభిరామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో వాళ్లు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారని టాక్. ఇక ఆ అమ్మాయి ఎవరు... పెళ్లి ఎప్పుడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దగ్గుబాటి రామా నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిర్మాతగా ఎన్నో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీకి అందించారు. ఇక ఆయనకు ఇద్దరు కుమారులు. ఒకరు దగ్గుబాటి సురేష్ కాగా మరొకరు దగ్గుబాటి వెంకటేష్. ఇక సురేష్ నిర్మాతగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయి... ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఎన్నో సూపర్ హిట్లను సినిమా పరిశ్రమకు అందించారు.

 Rana Daggubati

ఇక హీ వెంకటేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టార్ హీరోగా సెటిల్ అయి... ఎన్నో మంచి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక దగ్గుబాటి సురేష్ కు ఇద్దరు కుమారులు. అందులో ఒకరు రానా. మరొకరు దగ్గుపాటి అభిరామ్. ఇక రానా విషయానికి వస్తే... డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తూ.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.

ఇక అభిరామ్ విషయానికి వస్తే... ఆయన ఇండస్ట్రీలోకి రాకముందే.. వివాదాలతో ఫేమస్ అయ్యారు. శ్రీరెడ్డితో ప్రేమ వ్యవహారం.. ఆమె అభిరామ్ పై వేసిన ఆరోపణలు.. అప్పట్లో సెన్సెషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడిప్పుడే వాటికి దూరంగా ఉంటూ.. అభిరామ్ తనపై ఉన్న ఆ మరకను తుడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా చేశాడు.

ఇక అహింస సినిమా దగ్గుబాటి అభిరామ్ కు అంతగా బ్రేక్ ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక అభిరామ్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫొకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా... అభిరామ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దగ్గుపాటి రామానాయుడు కోరిక మేరకు తన తమ్ముడి మనవరాలు అంటే సురేష్ బాబు చెల్లెలి కూతురిని అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అభిరామ్ కు ఆ అమ్మాయి వరుసకు మరదలు అవుతుందట. అయితే వీరిద్దరూ చిన్నప్పటి నుండే ఇష్టపడడం వల్ల ఇంట్లో వాళ్లు వీళ్ళ పెళ్లి చేయాలని డిసైడ్ చేసినట్లు దగ్గుబాటి కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి పెళ్లి విషయానికి వస్తే... డిసెంబర్ 6న గ్రాండ్ గా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో రిచ్ ఫ్యామిలీ. ఇక వారసుడి పెళ్లి అంటే ఏ రేంజులో చేస్తారో తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X