బిపాసాను వదిలేసి కొత్తగర్ల్ ఫ్రెండ్‌తో రాణా?
తెలుగు హీరో రాణా దగ్గుబాటి దమ్ మారో దమ్ సినిమా తర్వాత నుంచి బిపాసా బసుతో లవ్వాయణం నడుపుతున్నాడని, తన మాజీ లవ్వర్ జాన్ అబ్రహంతో విడిపోయిన తర్వాత ఒంటరితనాన్ని భరించలేక పోతున్న బిప్స్ రాణా తోడు కోసం పరితపిస్తోందని బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే రాణా మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఆమెకు, తనకు ఉన్న బంధం స్నేహ బంధం మాత్రమే అని తెగేసి చెప్పాడు కూడా.
అయితే బిపాసా ప్రవర్తన మూలంగా తమ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో....ఆమెను అవాయిడ్ చేయడానికే ప్రిపరెన్స్ ఇస్తున్నాడు రాణా. వీలైనంత వరకు ఆమె ఉన్న చోటకి వెళ్లడమే మానేశాడట. ఇటీవల గోవాలో బిపాసా, త్రిష ఎంజాయ్ చేస్తుంటే.... ఈ విషయం తెలుసుకున్న రాణా అటు వైపు వెళ్లకుండా కొత్త గర్ల్ ఫ్రెండ్ తో రూటు మార్చాడని తాజా బాలీవుడ్ గుసగుస.
రాణా తనను అవాయిడ్ చేసి కొత్త గర్ల్ ఫ్రెండ్ తో గడుపుతున్నాడనే విషయం తులుసుకున్న బిపాసా చాలా బాధ పడిందని, ఎలాగైనా రాణాపై రివేంజ్ తీర్చుకోవడానికి సిద్ధం అవుతుందని, త్వరలో తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా రాణా గురించి సెన్షేషన్ కామెంట్స్ పోస్టు చేయడానికి సిద్ధం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











