రానా నిర్మాతగా అఖిల్ మూడో సినిమా.. క్రేజీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ ఎవరంటే..

హలో చిత్రం అందించిన ఊపుతో అఖిల్ తన మూడో సినిమాకు సిద్ధమవుతున్నాడు. అయితే అఖిల్ మూడో సినిమాకు రానా నిర్మాతగా మారారు అనే వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతున్నది.

By Rajababu

హలో చిత్రం అందించిన ఊపుతో అఖిల్ తన మూడో సినిమాకు సిద్ధమవుతున్నాడు. హలో చిత్రంలో అఖిల్‌కు మంచి మార్కులే పడినా ఆశించినంతగా కలెక్షన్లు రాకపోవడం కొంత నిరాశకు గురి చేసిందనేది సినీ వర్గాల టాక్. అయితే అఖిల్ మూడో సినిమాకు రానా నిర్మాతగా మారారు అనే వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతున్నది.

నిర్మాతలుగా నితిన్, నాగ్

నిర్మాతలుగా నితిన్, నాగ్

అఖిల్ తొలి సినిమాకు నిర్మాతగా హీరో నితిన్ వ్యవహారించారు. ఆ చిత్రం దారుణంగా దెబ్బ తీసింది. ఇక రెండో సినిమాకు స్వయంగా తండ్రి నాగార్జున నిర్మాతగా మారి సొంత బ్యానర్లో హలో రూపొందించారు. కలెక్షన్ల పరంగా సంతృప్తి మిగలకపోయినా మంచి చిత్రాన్ని రూపొందించామనే తృప్తి మిగిలింది.

మూడో సినిమాకు రానా దగ్గుబాటి

మూడో సినిమాకు రానా దగ్గుబాటి

ఇక అఖిల్ మూడో చిత్రం కోసం భళ్లాలదేవ రానా దగ్గుబాటి అండగా నిలిచారు. తన మూడో చిత్రం క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందనున్నది. ఆ చిత్రం గురించి జనవరి 10న మీడియాకు వెల్లడిస్తాను అని ఇటీవల అఖిల్ చెప్పారు.

పరిశీలనలో దర్శకుల పేర్లు

పరిశీలనలో దర్శకుల పేర్లు

అఖిల్ రెండో సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు కాగా, మూడో చిత్రానికి వంశీ పైడిపల్లి, కొరటాల శివ, సుకుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరు ఫైనల్ అవుతారో అనే విషయం పదో తేదీన స్పష్టమవుతుంది.

అట్లీ దర్శకత్వంలో

అట్లీ దర్శకత్వంలో

తమిళంలో మెర్సల్ లాంటి ఘన విజయం సాధించిన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు మీడియాలో ఓ వార్త చెలరేగుతున్నది. అయితే ఆ సినిమాపై ఇంకా క్లారిటీ లేదు.

సత్య పినిశెట్టి చెప్పిన కథకు

సత్య పినిశెట్టి చెప్పిన కథకు

ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు సత్య పినిశెట్టి కూడా అఖిల్‌ను కలిసి కథ వినిపించాడట. ఆది పినిశెట్టి సోదరుడు సత్య చెప్పిన కథ అఖిల్‌ను విశేషంగా ఆకట్టుకొన్నదట. సత్యకు ఓకే చెప్పినప్పటికీ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనేది లేటేస్ట్ టాక్.

జనవరి 10న క్లారిటీ

జనవరి 10న క్లారిటీ

అయితే అఖిల్ మూడో సినిమా ఏ దర్శకుడితో ఉంటుందనే కొంత సస్పెన్స్‌గానే ఉంది. అట్లీ, సత్యకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా రానా సినిమాతో ముందుకెళ్తాడా అనేది జనవరి 10న స్పష్టమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X