రానాకు ఆరోగ్య సమస్యలు.. విదేశాల్లో ట్రీట్మెంట్, ఫ్యాన్స్‌ని కంగారు పెట్టేలా కథనాలు!
Recommended Video

బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా రానాకు క్రేజ్ పెరిగింది. విలన్ పాత్ర అయినప్పటికీ బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్ తో రానా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఘాజి లాంటి విభిన్న చిత్రాలతో కూడా ఆడియన్స్ కు చేరువయ్యాడు. అటు బాలీవుడ్, ఇటు తెలుగులో రానా ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. తాజాగా రానా ఆరోగ్యం గురించి ఫాన్స్ ని కంగారు పెట్టేలా వార్తలు వస్తున్నాయి.

ఆరోగ్య సమస్యలు
ఆరడుగుల ఆజానుబాహుడు రానాకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తరచుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. చికిత్స చేయించుకుందుకు రానా తనగిన సమయంలో కోసం ఎదురుచూస్తున్నాడని సమాచారం. గతంలో రానా చిన్నపాటి కంటి సమస్య తలెత్తినట్లు వార్తలువచ్చిన సంగతి తెలిసిందే.

కంగారు పెడుతున్న కిడ్నీ సమస్య
ప్రస్తుతం రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. చికిత్స చేయించుకునేందుకు రానా విదేశాలకు వెళ్ళబోతున్నాడనే కథనాలు ఆంగ్ల పాత్రలో వెలువడుతున్నాయి.

కిడ్నీ మార్పిడి
సమస్య నివారణకు కిడ్నీ మార్పిడి జరగాలని డాక్టర్లు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.తన కిడ్నీని ఇచ్చేందుకు రానా తల్లి అంగీకరించిందట. కానీ ఆమె ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక రానా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

సింగపూర్
ఇదిలా ఉండగా కిడ్నీ ఇచ్చే దాత కోసం ఎదురుచూస్తున్నారు. తాజగా ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రకారం రానా చికిత్స నిమిత్తం త్వరలో సింగపూర్ లేదా అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి కుటుంబం మాత్రం ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు.

షూటింగ్స్ కి బ్రేక్
రానా ఆరోగ్య సమస్యల నేపథ్యంలో అతడు నటిస్తున్న చిత్రాల షూటింగ్ కూడా ఆపి ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. రానా తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతున్న హాథీ మేరే సాథీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలోనే వివరణ
గతంలో తనకు చిన్న కంటి సమస్య ఎదురైనప్పుడు మీడియాలో ఇదే విధంగా వార్తలు వచ్చాయి. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎలాంటి పుకార్లు నమ్మవద్దని రానా ఫ్యాన్స్ ని కోరాడు. తాజాగా వస్తున్న వార్తల నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ స్పందన ఎలాఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











