బాబాయ్‌తో అబ్బాయ్ కూడా! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

దగ్గుబాటి రానా.. చాలా తక్కువ సమయంలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న తెలుగు స్టార్. హీరోగా, విలన్‌గా, విలక్షణ పాత్ర దారుడిగా అన్ని రకాల పాత్రలు పోషించగలగటం రానా కెపాసిటీ. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన ఆయన టాలీవుడ్ సహా ఇతర భాషా చిత్రాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. కాగా తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాబాయ్ వెంకటేష్ నటిస్తున్న కొత్త సినిమా 'వెంకీ మామ'లో అబ్బాయ్ దగ్గుబాటి రానా కూడా భాగం కాబోతున్నాడని తెలుస్తోంది.

యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వెంకీమామ సినిమాలో రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తుది దశకు చేరుకుంది. అయితే దగ్గుబాటి, అక్కినేని ఫాన్స్ లో మరింత ఆసక్తిని రేకెత్తించేలా వెంకీమామలో ఓ చిన్న పాత్రలో రానాను కూడా చూపించాలని భావిస్తున్నారట ఆ చిత్ర దర్శకనిర్మాతలు. ఇందుకోసం రానాను సంప్రదించగా ఆయన కూడా ఓకే అనేశారని ఫిలింనగర్ టాక్.

Rana Daggubati guest role in Venky Mama..?

బాబీ దర్శకత్వంలో మామా అల్లుళ్ల మ‌ధ్య సాగే ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న 'వెంకీమామ‌' చిత్రంలో వెంక‌టేశ్ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగచైత‌న్య‌ సరసన రాశీఖ‌న్నా ఆడిపాడుతోంది. ఇందులో రైతు పాత్రలో వెంకటేశ్, ఆర్మీ ఆఫీసర్‌గా నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబ‌ర్‌ నెలలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

వెంకీ మామ చిత్రాన్ని దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లో నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X