రానా ఆరోగ్యంపై వదంతులు.. కిడ్నీ మార్పిడి నిజమేనా!
Recommended Video

సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినా హీరో రానా ఎప్పుడూ స్టార్ ఇమేజ్ పాకులాడలేదు. విలక్షణమైన పాత్రలు చేస్తూ నటుడిగా మంచి స్థాయికి చేరుకున్నాడు. బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడిగా నెగిటివ్ రోల్ పోషించి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం రానా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా చాలా కాలం నుంచి రానా ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ పుకార్లు మరోమారు జోరందుకున్నాయి.

రానా ఆరోగ్యంపై వదంతులు
తాజాగా రానా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన పెంచే విధంగా ఉన్నాయి. రానా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. వాటిపై అప్పుడే రానా స్పందించాడు. నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. నేను బాగానే ఉన్నా. కాకపోతే కాస్త బిపికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే అవి కూడా తీరిపోతాయి అని రానా గతంలోనే సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

కిడ్నీ మార్పిడి
ప్రస్తుతం ఇలాంటి ఊహాగానాలే మళ్ళీ మొదలయ్యాయి. సిగరెట్ తాగడం వలన రానా కిడ్నీ చెడిపోయిందని, అతడికి కిడ్నీ మార్పిడి అవసరం అని వైద్యులు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. రానా సన్నిహితులు మాత్రం ఈ పుకార్లని కొట్టిపారేస్తున్నారు. రానా ఎన్ని సార్లు తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చినా ఈ రూమర్లు మాత్రం ఆగడం లేదు.

చంద్రబాబు పాత్రలో
ఎన్ని ఊహాగానాలు వినిపించినా రానా మాత్రం తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. రానా ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో చంద్రబాబు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పాత్రలో రానా ఒదిగిపోయి నటించాడని ప్రశంసలు దక్కాయి.

రానా కోసం
రానా కోసం గుణశేఖర్ లాంటి దర్శకులు పెద్ద ప్లానే సిద్ధం చేస్తున్నారు. రానాతో హిరణ్యకశిపుడు అనే పౌరాణిక చిత్రం చేయడానికి తెరవెనక భారీ కసరత్తు జరుగుతోంది. అదే విధంగా వేణు ఊడుగుల అనే యువ దర్శకుడు విరాట పర్వం 1992 అనే పీరియాడిక్ డ్రామాని రానాతో తెరకెక్కించబోతున్నాడు. ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ రానా కోసం ఎదురుచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











