సీక్రెట్‌గా రానా, మిహికా బజాజ్ నిశ్చితార్థం.. అతిధులు జాబితా ఇదే.. పెళ్లి ఎప్పుడంటే?
మొత్తానికి సోలో లైఫ్ కి రానా దగ్గుబాటి ఎండ్ కార్డ్ పెటేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ఎవరికి తెలియకుండా తన లవ్ ట్రాక్ ని నడిపించిన రానా ఫైనల్ గా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మిహికా బజాజ్ అనే యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నేడు హైదరాబాద్ లోనే వారి నిశ్చితార్థం జరగబోతోంది.

పెళ్లి కళ వచ్చేసింది బాలా..
దగ్గుబాటి వారి ఇంట గత వారం రోజుల నుంచి పెళ్లి కళ కనిపిస్తోంది. ఎదో ఒక విధంగా లేటు వయసులో అయినా సరే మంచి అమ్మాయిని సెట్ చేసుకున్నాడు అని ఇంటి పెద్దలు కూడా మనోడిని తెగ పొగిడేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ లేకుంటే సంబరాలు ఒక రేంజ్ లో ఉండేవి.

నేడే నిశ్చితార్థం..
పిల్లను పరిచయం చేశాడో లేదో చాలా వేగంగా పెళ్లి పనులను మొదలు పెట్టేశాడు రానా. మే 20 తేదీ సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో రానా మిహికా బజాజ్ నిశ్చితార్థాన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం జరిగే ఈ ఎంగేజ్మెంట్ కి కేవలం దగ్గుబాటి దగ్గరి బంధువులు మాత్రమే రానున్నారట. ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఈ వేడుకను కొంతమంది పరిధిలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి పనులు మొదలయ్యాయి..
రానా దగ్గుబాటి, సురేష్ బాబు కొన్ని రోజుల క్రితమే ఇంట్లో ఓఎల్లి పనులు మొదలు పెట్టినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎంగేజ్మెంట్ ముహూర్తం సమయానికి పూర్తి చేసి పెళ్లి మాత్రం లాక్ డౌన్ తరువాత గ్రాండ్ గా నిర్వహించాలని సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత వరకు కరోనా తగ్గుముఖం పట్టిన తరువాతే పెళ్లి జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

'యస్' అనేసింది..
కొన్ని రోజుల క్రితం రానా తన ప్రేయసి యస్ చెప్పింది అంటూ ఫోటో షేర్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా రానా షాకివ్వడం ఓ విదంగా ఆశ్చర్యానికి గురి చేసింది. అతను ప్రేమ వ్యవహారాన్ని నడువుతున్నాడు అని అనేక రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అతని పాట్నర్ ఎవరో హీరోయిన్ అయ్యి ఉంటుందని అంతా భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ ని నడుపుతున్న వ్యవస్థాపకురాలని రానా చెప్పే వరకు తెలియదు.


Click it and Unblock the Notifications











