Manadu Remakeలో ట్విస్ట్.. రానా చేతుల్లోనే సినిమా.. కానీ?
ఈ మధ్య కాలంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అనేక రీమేక్ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఇతర భాషలో సూపర్ హిట్ గా నిలిచిన అనేక సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ వాటిని డిజిటల్ లో విడుదల చేస్తున్నారని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దానికి తోడు ఈ మధ్య థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య రానా మానాడు రీమేక్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. తమిళంలో వెంకట్ ప్రభు దర్శకుడిగా శింబు హీరోగా ఎస్జే సూర్య కీలకపాత్రలో నటించిన మానాడు సినిమా సూపర్ హిట్ అయింది. టైం లూప్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు మెప్పించడంతో చాలా కాలం తర్వాత శింబు హిట్టు కొట్టారు.
అయితే అదే సినిమాని తెలుగులో రానా చేయబోతున్నారు అంటూ నాగచైతన్య కామెంట్ చేయడంతో ఈ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు మళ్లీ మళ్లీ ఎన్ని రీమేక్ సినిమాలు చేస్తారంటూ వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ సినిమాలో రానా నటించడం లేదని, కేవలం ప్రొడ్యూసర్ గా మాత్రమే వ్యవహరిస్తారనే విషయం తెర మీదకు వచ్చింది. ఈ సినిమాలో నటించే వారి కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోందని అలాగే ఎవరిని దర్శకుడుగా తీసుకోవాలని విషయం పైన కూడా సురేష్ బాబు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ మధ్యనే రానా కుటుంబం ఒక స్థల వివాదంలో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే.. ఒక లీజు దారిడికి స్థలం లీజుకి ఇచ్చిన తర్వాత అతని ప్రమేయం లేకుండా స్థలాన్ని విక్రయించిన కేసులో రానా సహా వెంకటేష్ ఇప్పుడు ఇబ్బందులు పాలవుతున్నారు. వారు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మానాడు సినిమా రీమేక్ విషయంలో క్లారిటీ రావడంతో దగ్గుబాటి అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయట హీరోలు అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తమ హీరోలు మళ్ళీ మళ్ళీ రీమేక్ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంటే ఇబ్బంది పడుతున్నామని వారు చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











