రాణాని వర్మ తన కొత్త సినిమాలోకి తీసుకోవటం వెనక సీక్రెట్?
రాణా తాజాగా రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం డిపార్టమెంట్ లో ఓ హీరోగా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. అభిషేక్ బచ్చన్ ప్లేసులో రాణాని తీసుకోవటానకి కారణం రాణా తండ్రి సురేష్ బాబు అని తెలుస్తోంది. రాణా మొదటి సినిమా దమ్ మారో దమ్ రిలీజ్ అయి హిట్ కాకపోయినా పాజిటివ్ టాక్ తెచ్చుకోవటంతో తన కొడుకుని బాలీవుడ్ మార్కెట్లో నిలబెట్టాలని సురేష్ బాబు వేసిన ప్లాన్ ఫలితమే వర్మ సినిమాలో బుక్కవటం అంటున్నారు. డిపార్టమెంట్ కు ఫైనాన్సియర్స్ సమస్య ఎదుర్కొంటోందని అందుకే వర్మకు తన సంస్ధ తరుపున సాయిం చేసినట్లు ఉంటుంది తన కొడుకుని మరోసారి బాలీవుడ్ మీద రుద్దినట్లు ఉంటుంది అని సురేష్ బాబు ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. రాణా కూడా ఎప్పుటినుంచో రామ్ గోపాల్ వర్మను ఆరాధిస్తున్నాడు. దాంతో రోగీ పాలే కోరాడు..అన్నట్లు రామ్ గోపాల్ వర్మ వెంటనే స్పందించి రాణాకి అవకాశం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











