మరో భారీ బడ్జెట్ సినిమాలో రానా - ప్రభాస్.. గోపిచంద్ చేయాల్సిన పాత్రలో..
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా రెబల్ స్టార్ సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇకపోతే బాహుబలి విజయంలో కీలకపాత్ర పోషించిన రానా మరోసారి ప్రభాస్ తో కలిసి నటించబోతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రభాస్ - రానా.. మరో సినిమా
ఒక సినిమాలో హీరో యొక్క స్థాయి పెరగాలి అంటే.. విలన్ హీరోకంటే బలవంతుడై ఉండాలి. అప్పుడే సినిమాలో హీరో గెలిస్తే మరింత హైప్ క్రియేట్ అవుతుంది. బాహుబలి సినిమాలో ఆ ఫార్ములా ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రభాస్ రానా క్రేజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. అయితే ఆ కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు టాక్ వస్తోంది.

ఆ సినిమాలో స్పెషల్ రోల్..
అయితే ఈ సారి బాహుబలి రేంజ్ లో ఉండదట. కేవలం రానా కొన్ని నిమిషాలు మాత్రమే ఉండే గెస్ట్ పాత్రలో కనిపిస్తాడట. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు రాధే శ్యామ్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఇక పాన్ ఇండియా తరహాలో సినిమా తెరకెక్కుతోంది కాబట్టి రానా క్రేజ్ ని కూడా ఒక 5నిమిషాల వరకు వాడుకొనున్నట్లు తెలుస్తోంది.

గోపిచంద్ అన్నారు..
ఇకపోతే మరొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. రానా చేస్తున్న ఆ స్పెషల్ రోల్ కోసం మొదట యాక్షన్ హీరో గోపిచంద్ ని అనుకున్నారట. గోపిచంద్, ప్రభాస్ ఎంత మంచి మిత్రులో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ప్రభాస్ ఆలోచన ప్రకారం రానా చేస్తేనే బెటర్ అని దర్శకుడికి వివరంచగా స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సినిమా రిలీజ్..?
ఇక వీలైనంత వరకు కరోనా పూర్తిగా తగ్గిన తరువతే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో పెద్ద సినిమాలు రిలీజ్ కాకుంటే అప్పుడు రావాలని.. మిగతా సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న తరువాతే తన సినిమా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయాలని ప్రభాస్ ఒక సేఫ్ జోన్ లో ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











