ప్రభాస్‌కు చెక్ పెట్టేందుకు రానా ప్లాన్.. టాలీవుడ్ టాల్ హీరోల మధ్య మరో వార్.!

By Manoj

కొన్నేళ్లుగా భారీ సినిమాలే చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అదే సమయంలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. అన్ని ఇండస్ట్రీల వారికి సుపరిచితుడు అయిపోయాడు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా. వీళ్లిద్దరూ కలిసి గతంలో ఓ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభాస్, రానా మధ్య స్నేహం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరి మధ్య ఓ దర్శకుడు గొడవకు ప్లాన్ చేశాడట. దీంతో ప్రభాస్‌కు చెక్ పెట్టేందుకు రానా వ్యూహాలు రచిస్తున్నాడట. ఇంతకీ ఏం జరిగిందంటే....

జక్కన్న కలిపాడు.. వార్ డిక్లెర్ చేశాడు

జక్కన్న కలిపాడు.. వార్ డిక్లెర్ చేశాడు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా నటించాడు. ఈ ఇద్దరి నటనకూ మంచి మార్కులే పడ్డాయి. మరీ ముఖ్యంగా వీళ్ల మధ్య యుద్ధం సినిమాకు హైలైట్ అయిపోయింది.

 ఆ విషయంలో మాత్రం ఇద్దరూ తోపులే

ఆ విషయంలో మాత్రం ఇద్దరూ తోపులే

ఈ ఇద్దరు హీరోలు సినిమా కోసం ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తారు. గతంలో ‘బాహుబలి' సినిమా కోసమే దాదాపు ఐదేళ్లు ఒకేలాంటి ఫిట్‌నెస్ మెయింటైన్ చేశారు. అదీకాక.. పాత్రను బట్టీ బరువు పెరగడం.. తగ్గడం చేశారు. ఆ తర్వాత నటించే సినిమాల విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. మొత్తానికి ఫిట్‌నెస్‌లో మాత్రం ఇద్దరం తోపులమే అనిపించుకుంటున్నారు.

ఒకటి పాన్ ఇండియా.. ఇంకోటి పాన్ వరల్డ్

ఒకటి పాన్ ఇండియా.. ఇంకోటి పాన్ వరల్డ్

ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా 1960 దశకం నాటి కథతో రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. దీని తర్వాత ‘మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేస్తాడు. ఇది పాన్ వరల్డ్ రేంజ్‌తో వస్తుందని దర్శకుడు చెబుతున్నాడు.

రానా మాత్రం డిఫరెంట్‌గా చేస్తున్నాడు

రానా మాత్రం డిఫరెంట్‌గా చేస్తున్నాడు

దగ్గుబాటి రానా కొద్ది రోజులుగా ముఖానికి మేకప్ వేసుకోలేదు. దీనికి కారణం అతడి అనారోగ్య పరిస్థితులే అన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా... రానా ప్రస్తుతం ‘హాతీ మేరా సాతీ' అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. తెలుగులో ఇది ‘అరణ్య'గా వస్తోంది. దీనితో పాటు ‘విరాటపర్వం' అనే మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది.

సీక్రెట్ రివీల్ చేసి ప్రభాస్‌ను బుక్ చేశాడు

సీక్రెట్ రివీల్ చేసి ప్రభాస్‌ను బుక్ చేశాడు

ఇటీవల రానా తన ప్రేమను బయటపెట్టిన విషయం తెలిసిందే. మిహీక బజాజ్‌ అనే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌తో అతడు ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. దీంతో టాలీవుడ్‌లోని మరో బ్యాచ్‌లర్ అయిన ప్రభాస్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అతడి పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 టాలీవుడ్ టాల్ హీరోల మధ్య మరో వార్.!

టాలీవుడ్ టాల్ హీరోల మధ్య మరో వార్.!

చాలా కాలంగా స్నేహితులుగా ఉన్న ప్రభాస్, రానా మధ్య ఓ దర్శకుడు గొడవ పెట్టాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అయితే, అది రియల్ లైఫ్‌లో మాత్రం కాదులేండి. త్వరలోనే తెరకెక్కనున్న నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీలో రానా విలన్‌గా నటించబోతున్నాడట. హీరోతో పోటీగా ఉండే ప్రతినాయకుడి పాత్ర కావడం వల్లే దీన్ని అతడు అంగీకరించాడని అంటున్నారు.

Recommended Video

Mahanati Director Nag Ashwin On Liquor Selling In Theatre & Multiplexes
ప్రభాస్‌కు చెక్ పెట్టేందుకు రానా ప్లాన్

ప్రభాస్‌కు చెక్ పెట్టేందుకు రానా ప్లాన్

వాస్తవానికి ఈ పాత్రకు కోలీవుడ్ స్టార్ హీరో అరవింద స్వామిని తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ, తెలుగు హీరో అయితే బాగుంటుందని నాగ్ అశ్విన్ భావించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసమే.. నిర్మాత అశ్వనీదత్ అతడితో చర్చలు జరిపాడని సమాచారం. ఈ కథలో విలన్ పాత్ర ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేస్తున్నాడట దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X