బాలయ్యకు ఎన్టీఆర్ ఝలక్.. రానా గ్రీన్ సిగ్నల్.. క్రేజీ రీమేక్‌పై హాట్ చర్చ!

టాలీవుడ్‌లో రీమేక్‌ల పర్వం మొదలైంది. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో హిట్టైన చిత్రాలను రీమేక్‌ చేసే పనిలో యువ హీరోలు ఉన్నారు. తమిళం నుంచి అసురన్, హిందీ నుంచి కొన్ని చిత్రాలు తెలుగులో పునర్మించబడుతున్నాయి. అదే క్రమంలో మలయాళంలో హిట్టైన అయ్యప్పనమ్ కోషియయ్ అనే చిత్రం రీమేక్‌పై తెలుగు ఇండస్ట్రీలో చర్చగా భారీగానే జరుగుతున్నది. అయితే అందులో వాస్తవమేంతో గానీ.. ఈ మల్టీ స్టారర్ సినిమా వార్త మాత్రం వైరల్ అవుతున్నది. వివరాల్లోకి వెళితే..

మలయాళంలో క్రేజీ హిట్‌గా

మలయాళంలో క్రేజీ హిట్‌గా

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ (అయప్ప నాయర్‌గా) కలిసి నటించిన అయ్యప్పనమ్ కోషియయ్ విమర్శకుల ప్రశంసలకు నోచుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తే బాగుంటుందనే విషయంపై పలువరు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

నాగవంశీ చేతికి రీమేక్ రైట్స్

నాగవంశీ చేతికి రీమేక్ రైట్స్

ఇలాంటి వార్తల మధ్య అల వైకుంఠపురంలో చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అయ్యప్పనమ్ కోషియయ్ రీమేక్ రైట్స్ తీసుకొన్నారనే వార్త బాంబులా పేలింది. దాంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మల్టీస్టారర్ సినిమాలో ఎవరు చేస్తారనే ఊహగానాలు జోరుగా షికారు చేశాయి.

బాలకృష్ణ, రానా కాంబినేషన్‌లో

బాలకృష్ణ, రానా కాంబినేషన్‌లో

అయ్యప్ప నాయర్ పాత్ర కోసం బాలకృష్ణతో సంప్రదింపులు జరిగాయని, ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్ర కోసం ఎన్టీఆర్‌ను సంప్రదించగా నో చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత అదే పాత్ర కోసం మంచు విష్ణును కూడా అడిగితే అందుకు ఒప్పుకోలేదని, చివరకు రానా ఆ పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది తాజా సమాచారం.

Recommended Video

Naarappa Movie Intresting Update | Victory Venkatesh | Priyamani
 అధికారికంగా వస్తేనే గానీ..

అధికారికంగా వస్తేనే గానీ..

ఇక అయ్యప్పనమ్ కోషియయ్ రీమేక్‌లో బాలకృష్ణ, రానా నటిస్తున్నారనే విషయంపై అఫీషియల్‌గా క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా రీమేక్ వార్తలు మాత్రం మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక గురించి అధికారికంగా వార్త వస్తే గానీ.. ఈ రీమేక్‌పై క్లారిటీ రాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X