»   »  నిజమా : త్రిష,రానా ఓ ప్రెవేట్ సూట్ లో ఎంజాయ్ (ఫొటోలు)

నిజమా : త్రిష,రానా ఓ ప్రెవేట్ సూట్ లో ఎంజాయ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : త్రిష,రానా ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. బాహుబలి హిట్ అవటంతో రానా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి సైమా 2015 లో పార్టీ చేసుకున్నారు. వీరిద్దరూ సింగిల్ గా ఉంటున్నా ....దుబాయి లో ఈ పార్టీలో మింగిల్ అయ్యారంటున్నారు. రమ్యకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టిలో ధనుష్,తాప్సీ కూడా పాల్గొన్నారు. అయితే అందరి దృష్ణీ త్రిష,రానాల మీదే పడింది. వీరిద్దరూ కలిసి రీసెంట్ గా ఓ ప్రెవేట్ సూట్ లో కలిసి పార్టీ చేసుకున్నారంటూ ఇప్పుడు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆ మధ్యన హాట్ టాపిక్ గా కొంతకాలం త్రిష,రానా బ్రేక్ అప్ అయ్యారంటూ తమిళ,తెలుగు సినిమా వర్గాల్లో జోరుగా వినిపించింది. దానికి తోడు ఆ మధ్యన త్రిష ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. అయితే రీసెంట్ గా మళ్లీ ఈ జంట ఒకటైంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

త్రిష,వరుణ్ ల మధ్య ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయ్యిన తర్వాత రానా, త్రిష కలిసి మంచు మనోజ్ సంగీత్ సెర్మనీలో కనిపించారు. అయితే ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసారు. ఇదిగో ఇప్పుడు ఇలా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఎక్కడ చూసినా తామే అంటూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇంకోప్రక్క త్రిష ..హైదరాబాద్ షిప్ట్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

స్లైడ్ షోలో ...గతంలో తమిళంలో ఎఫైర్స్ పెట్టుకున్నారంటా వార్తలు వచ్చినవాళ్లని చూడండి.

ప్రభు,సిల్క్ స్మిత

ప్రభు,సిల్క్ స్మిత

అప్పట్లో తమిళంలో హీరోగా వెలిగిన ప్రభుకు ఐటం గర్ల్ గా తనకంటూ స్ధానం సంపాదించుకున్న సిల్క్ స్మితకు మధ్య రిలేషన్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు సిల్క్ స్మిత తో కలిసి అప్పుడు ప్రభు వేరే చోటకు వెళ్లిపోయి హోటల్ రూం లో గడిపారని వార్తలు వచ్చాయి.

విశాల్-రీమా సేన్

విశాల్-రీమా సేన్

అప్పట్లో విశాల్,రీమాసేన్ ప్రేమలో పడ్డారు. చెల్లామే సినిమా సమయంలో వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టారని అన్నారు. అప్పుడు ఓ హీరోయిన్ తో తాను డేటింగ్ చేస్తున్నట్లు విశాల్ చెప్పుకొచ్చారు కూడా.

అజిత్-హీరా

అజిత్-హీరా

చాలా మందికి తెలియని విషయం ఇది. ప్రేమలేఖ సమయంలో హీరా తో అజిత్ ప్రేమలో పడి డేటింగ్ చేసాడని అంటారు. చాలా కాలం వీరిద్దరి మధ్యా లివ్ ఇన్ రిలేషన్ షిప్ నడిచిందని చెప్తారు.

నయనతార-ఉదయనిధి స్టాలిన్

నయనతార-ఉదయనిధి స్టాలిన్

ప్రభుధేవా తో నయనతార బ్రేక్ అప్ అయ్యినప్పుడు ఉదయనిధి స్టాలిన్ కి ప్రపోజ్ చేసాడని ఆమె రిజెక్ట్ చేసాడని చెప్తారు. అయితే ఆ డిజప్పాయింట్ లో ఉదయనిధి విషం తీసుకుని హాస్పటిల్ లో చేరాడని అంటారు. తర్వాత పరిస్దితులు మారి నయనతార టచ్ లోకి వచ్చాడని అంటారు.

ధనుష్-శృతి హాసన్

ధనుష్-శృతి హాసన్

వీరిద్దరూ త్రీ సినిమాకు కలిసి పనిచేసారు. ఆ సినిమాకు ధనుష్ భార్య ఐశ్వర్యారాయ్ డైరక్ట్ చేసింది. అయితే అదే సమయంలో వీరిద్దరు మధ్య ఎఫైర్ నడించిందని వార్తలు వచ్చాయి.

కమల్ హాసన్-సిమ్రాన్

కమల్ హాసన్-సిమ్రాన్

కమల్ హాసన్,సిమ్రాన్ కలిసి పంచతంత్రం చేసారు. ఆ సమయంలో వీరిద్రు మధ్య హాట్ ఎఫైర్ నడిచిందని వార్తలు వచ్చాయి. దాన్ని కంటిన్యూ చేస్తూ కమల్ తన తదుపరి చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.

రిలేషన్ షిప్ లో ...

రిలేషన్ షిప్ లో ...


త్రిష, రానా ఇద్దరూ రెండు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే వారిద్దరూ దాన్ని అఫీషియల్ గా ధృవీకరించలేదు అనుకోండి...

English summary
Check out the slides above for some of the hottest link-ups of Kollywood. Now, in what looks like a resuscitation of lost romance, Rana and Trisha are being spotted together often. According to the latest report by Times of India, the two were seen getting comfortable in each other's company in Dubai at the recently concluded SIIMA Awards 2015. The report has it that the alleged ex-lovers were seen partying together in a private suite. If the latest buzz turns out to be true, we might have a new star couple in the house.
Please Wait while comments are loading...