Chiru 156: టాలీవుడ్‌లో సెన్సేషనల్ మల్టీస్టారర్.. చిరంజీవికి విలన్‌గా తెలుగు స్టార్ హీరో

తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోల కంటే సీనియర్లే ఎంతో వేగంగా సినిమాలు చేస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత జోష్‌తో దూసుకుపోతోన్న ఆయన.. ఏకధాటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో చిత్రాలను చేసి ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్‌లో అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీలో చిరంజీవిని ఢీకొట్టేందుకు టాలీవుడ్ హీరో రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!

ఇటీవలే చిరంజీవి 'భోళా శంకర్' మూవీతో వచ్చారు. ఈ చిత్రం మాత్రం భారీ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం మెగాస్టార్ ఇప్పుడు 'బింబిసార' దర్శకుడు మల్లిడి వశిష్టతో ఓ సినిమాను చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

Rana Daggubati Turns Villain For Chiranjeevi for Mallidi Vasishta Movie

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పంచ భూతాలను చూపించి ఆసక్తిని పెంచేశారు. అదే సమయంలో ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్నట్లు కూడా రివీల్ చేసేశారు.

యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా.. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మాదిరిగా ఉండబోతుందని తెలిసింది. అంతేకాదు, మానవుడైన హీరో పలు లోకాలను చుట్టి వచ్చేలా వరం పొందుతాడట. ఆయా లోకాల్లో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని ఇప్పటికే న్యూస్ లీకైంది.

క్రేజీ కాన్సెప్టుతో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు నటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో విలన్‌గా స్టార్ హీరోను తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం కోసం దగ్గబాటి రానాను ఫైనల్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

Rana Daggubati Turns Villain For Chiranjeevi for Mallidi Vasishta Movie

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో దగ్గుబాటి రానాను తీసుకోవాడానికి కారణం.. అతడికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉండడమే అని తెలుస్తోంది. ఈ మూవీని మల్లిడి వశిష్ట పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నాడట. అందుకే అన్ని భాషల వాళ్లకు తెలిసిన హీరో కావడంతో రానాను తీసుకున్నారని తెలిసింది. అతడి ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. హీరో పాత్ర మూడు లోకాలను చుట్టి వచ్చేలా డిజైన్ చేయబట్లే ఈ చిత్రానికి 'ముల్లోక వీరుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు మరో రెండు మూడు టైటిళ్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక, ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X