పంజా హీరోయిన్ పై ఆ తెలుగు హీరో కన్ను
పవన్ కళ్యాణ్ పంజా ద్వారా పరిచయమవుతున్న హీరోయిన్ సారా జేన్ డియాస్. ఆమె పై రాణా దగ్గుపాటి కన్ను పడింది. ఎలాగైనా ఆమెను తన ప్రక్కన బుక్ చేయాలని తాపత్రయపడుతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. క్రిష్ సినిమాలో గానీ,లేదా మరో కొత్త దర్శకుడుతో ఓకే అయిన ప్రాజెక్టులోకి కానీ ఆమెను తీసుకోవాలని రాణా పట్టుపడుతున్నట్లు చెప్తున్నారు. దానికి కారణం ఏదైనా ఆమె పవన్ ప్రక్కన చేసింది కాబట్టి పంజా హిట్టవగానే ఆమెకు క్రేజ్ వస్తుందని ఇప్పుడే బుక్ చేసుకుంటే బెస్ట్ అని మరీ తన నిర్మాతలను హెచ్చరించి మరీ కంగారుపెట్టి ఆమె డేట్స్ తేసుకోమని ప్రెజర్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక రాణా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందున్న డిపార్టమెంట్ చిత్రంలో చేస్తున్నాడు. అలాగే ప్రకాష్ తోలేటి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న నా ఇష్టం చిత్రం కూడా చేస్తున్నాడు.
నా ఇష్టంలో జెనీలియాని రాణానే ఎంపిక చేసి తీసుకున్నాడు. సింహా నిర్మాతలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. రొమాంటిక్ కామిడీ గా జరిగే ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం మలేషియాలో జరిగింది. క్యారెక్టర్ బేసెడ్ గా జరిగే లవ్ స్టోరీ ఈ చిత్రం అని చెప్తున్నారు. ఈ చిత్రాలు పూర్తవగానే క్రిష దర్శకత్వంలో రాణా తో చిత్రం మొదలువుతుంది. వేదం తర్వాత క్రిష్ చేస్తున్న చిత్రం ఇదే. పక్కా మాస్ మసాలా చిత్రంగా ఆ చిత్రాన్ని చెప్తున్నారు. రాణా మాత్రం తను వర్మ దర్సకత్వంలో చేస్తున్న డిపార్టమెంట్ మంచి క్రేజ్ తెస్తుందని,తనకు బాలీవుడ్ లో మంచి ఆపర్స్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నాడు. అందులో పోలీస్ అధికారిగా రాణా కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











