‘రాక్షసి’తో డిప్రెషన్ లో రాణా-కౌన్సిలింగ్ ఇచ్చిన వెంకీ..

By Sindhu

టాలీవుడ్ లో మరొక నట వారసత్వాన్ని పుచ్చుకున్న దగ్గుబాటి 'రాణా" రెండవ సినిమాకే దిగాలు పడ్డాడని తెలుస్తుంది. రాణా మొదటి చిత్రం 'లీడర్" పర్వాలేదనిపించినా, వసూళ్ల విషయంలో లాభం సమకూర్చలేక పోయింది. అయినా, పెట్టిన ఖర్చు రావటంతో, ఏవియమ్ బ్యానర్ ఊపిరి పీల్చుకుంది.

'నేను నా రాక్షసి" చిత్రంపై రాణా పెద్ద హోప్స్ పెట్టుకున్నట్టు ఫిలింవర్గాలు చెప్పుకున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం, హీరోయిన్ ఇలియానా ఉండటంతో, మరో పోకిరి అవుతుందా? అని ఫిలిం పరిశ్రమలో పుకార్లు ఊపందుకున్నాయి. కానీ 'నేను నా రాక్షసి" బాక్సాఫీసు దగ్గర బొల్తా పడటంతో, 'రాణా" డిప్రెషన్ లో పడిపోయి, త్రాగటం ఎక్కువ చేశాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు. పైగా ఈ డిప్రెషన్ లో రాణా, గోవాలో ఉన్న ఇలియానాతో కలిసి, సినిమా ఫెల్యూర్ బాధను మరచిపోయేందుకు ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుంటూ, గోవాలో ఎంజాయ్ చేస్తున్నారని కూడా ఫిలింగర్ లో పుకార్లు.

రాణా బాధను చూస్తున్న విక్టరీ వెంకటేష్ రాణాకు పెద్ద ఎత్తున కౌన్సిలింగ్ ఇవ్వటానికి సిద్దమయ్యి రాణాను పిలిచి, తన అనుభవానలు చెప్పి ఊరడించాడని ఫిలింనగర్ లో మరొక పుకార్లు. సక్సెస్, ఫెయిల్యూర్ అనేటివి ఒకే దృష్టితో స్వీకరించాలని, తను కూడా ఎన్నో ప్లాప్ సినిమాలను చవిచూశానని, రాణాకు వెంకీ ఎంతో ధైర్యం చెప్పాడట. ఏ హీరో అయినా అంకిత భావంతో పనిచేయాలని, హీరోయిన్లు వలలో పడటం, విపరీతంగా తాగటం మానివేయాలని, అప్పుడే సినీ రంగంలో పైకి వస్తాడని పెద్ద క్లాసు తీసుకున్నాడని కూడా పుకార్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X