దర్శక రత్న పై 'లీడర్' రాణాకి కోపం వచ్చింది!?
నలుగురు పెద్ద నిర్మాతలు ఇండస్ట్రీని పాడు చేస్తున్నారంటూ రీసెంట్ గా ఓ ఫంక్షన్ లో వారిపై నోరు పారేసుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు..తన పుట్టినరోజు సంతరించుకుని మరొక్కసారి వారిపై విమర్శనాస్త్రాలను విసిరాడు. ఇన్నాళ్ళ నా అనుభవాన్ని తెలుగు సినీ ప్రరిశ్రమకు ఉపయోగపడేవిధంగా త్వరలో, కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఆర్టిస్ట్స్ లు, ఇతర సాంకేతిక నిపుణుల కోసం ఒక ఇన్ స్టిట్యూట్ ని స్థాపించాలని నిర్ణయించుకున్నాను. అది ఈ సంవత్సరమే కార్యరూపం దాల్చుతుందని" తెలుగు పరిశ్రమను బాగు చేయడానికి బలిపశువుని అవ్వడానికైనా సిద్దంగా ఉన్నానని ఆయన పలికిన పలుకులు మరింత ఆశ్చర్యాన్నీ కలిగించాయి.
గతంలో ఆయన మాట్లాడిన తీరుకు నలుగురు నిర్మాతలలో ఎవరూ బదులు చెప్పకపోగా లైట్ గా తీసుకున్నారు. మళ్లీ వారి నోటి నుండి ఏదైనా బయటకు తెప్పించాలని దాసరి వారిపై గురి ఎక్కుపెట్టారు. కానీ ఈ సారి కూడా వారి నుండి ఎటువంటి సమాధానం రాకపోవడం విశేషం.
ఆ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు తనయుడు రాణా మాత్రం దాసరిని డైరెక్ట్ గా కాకుండా ప్రక్కనుండి బాణాలు విసురుతున్నాడు. పరిశ్రమలో కొందరు దర్శకులు కొన్ని నిర్మాణ సంస్థలపై ఎగిసి పడుతున్నారని అది మంచి పరిణామం కాదని..ఆయన తెలుపుతున్నాడు. అణిగిపోతున్న సినీ పరిశ్రమను ఆ నలుగురే కాపాడారని గుర్తుంచుకుని మాట్లాడితే బాగుంటుందని..హెచ్చరిక చేసినట్లుగా రాణా పలకడం అందరికీ ఆశ్చర్యాన్నీ కలిగించింది.


Click it and Unblock the Notifications











