రిలాక్స్ అవటానికి ఆ యంగ్ హీరోని గోవా తీసుకెళ్ళిన ఇలియానా
నేను..నా రాక్షసి చిత్రంలో జంటగా చేసిన రాణా, ఇలియానా ఆ చిత్రం షూటింగ్ లో బాగా దగ్గరయ్యారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇలియానా తల్లి చేత హైదరాబాద్ లో పెట్టించిన బోటిక్వీ బిజెనెస్ కు సైతం రాణానే దగ్గరుండి సాయిం చేసి అంతా ఎరేంజ్ చేసారు. దాంతో ఇలియానాకు మరీ దగ్గరయ్యాడు రాణా.తాము నటించిన చిత్రం ప్లాప్ కావటంతో ఇద్దరూ ఒకరిని ఒకరు ఓదార్చుకునేందుకు గోవా వెళ్ళాడని చెప్తున్నారు. అందులోనూ ఇలియానా వరసగా శక్తి,నేనూ నా రాక్షసి చిత్రాలు ఫెయిల్యూర్ కావటం, రాణా చేసిన దమ్ మారో దమ్, నేనూ నా రాక్షసి చిత్రాలు పోవటంతో ఇద్దరూ మానసికంగా మరింత దగ్గరయ్యారని చెప్పుకుంటున్నారు. ఇక గోవాలో ఇలియానాకు ఫైవ్ స్టార్ హోటల్ తరహా బంగ్లా ఉంది. అక్కడే వీళ్ళిద్దరూ రిలాక్స్ అవుతున్నారని చెప్పుకుంటున్నారు. ఇలియానాకు ప్రస్తుతం తెలుగులో ఏ చిత్రమూ లేదు. రాణాకి మాత్రం నా ఇష్టం అనే చిత్రం చేతిలో ఉంది. సుకుమార్ అసెస్టెంట్ ప్రకాష్ దర్సకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. జెనీలియా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











