ప్రయోగాల డైరక్టర్ కి రాణా గ్రీన్ సిగ్నల్

By Srikanya

లీడర్, దమ్ మారో దమ్, నేను నా రాక్షసి చిత్రాలతో పరిచయమైన దగ్గుపాటి రాణాకి ఇప్పటివరకూ విజయం పలకరించలేదు. అయితే సినిమాలు మాత్రం కంటిన్యూగా చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ లో చేస్తున్న రాణా తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. క్రిష్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. క్రిష్ ఆ చిత్రాన్ని తానే స్వయంగా ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తానే నిర్మించదలిచారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించి ప్రి ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. మరో ప్రక్క రాణా .. 'నా ఇష్టం" టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీగా రూపొందుతోంది. అందాల హాసిని జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సక్సస్ ఫుల్ యువనిర్మాత పరుచూరికిరీటి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం 'నా ఇష్టం'.

జెనీలియాకు కూడా ప్రస్తుతం ఈ సినిమా హిట్టవటం చాలా అవసరం. ఇటీవల రాణా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు బుజ్జి నిర్మించిన "నేను- నా రాక్షసి" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదీకాక రాణా ఇంకా తనను తాను ఒక పక్కా కమర్షియల్ మాస్ హీరోగా నిరూపించుకోవలసి ఉంది. అది అనుకున్నంత సులువైన సంగతేం కాదు. అందుకు రాణా ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. తాను నటించబోయే పాత్ర గురించి మరింత శ్రద్ధ తీసుకుని చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X