అక్కినేని ఫ్యామిలీ హీరో కోసం రానా చేయూత!
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ కూడా ఒకడు. సుశాంత్ కు తన కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయం లేదు. ఇటీవల సుశాంత్ నటించిన ఆటాడుకుందాం రా చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. తాజగా సుశాంత్ నటిస్తున్న చిత్రం చి.ల. సౌ. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే టీజర్ కూడా విడుదల చేయనున్నారు. తాజగా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీజర్ రానా చేతుల మీదుగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

రానా చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేసి చిత్రంపై బజ్ పెంచాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గతంలో హీరోగా నటించాడు. ఆయన దర్శకుడిగా మారి ఈ చిత్రం చేస్తుండడంతో ఆసక్తి నెలకొని ఉంది. చి.ల. సౌ చిత్రం తనని పరాజయాల నుంచి గట్టెక్కిస్తుందని సుశాంత్ భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











